Anudeep KV Latest Movie Gossip: పట్టు వదలని అనుదీప్

Anudeep KV Latest Movie Gossip

యంగ్ డైరెక్టర్ అనుదీప్ వైఖరి చూస్తుంటే పట్టు వదలని విక్రమార్కుడి కథను తలపిస్తోంది. అదేంటి సున్నితంగా, సాఫ్ట్ గా ఎవరిని పల్లెత్తు మాటైన అనని అనుదీప్ లో పట్టువదలని విక్రమార్కుడు కనిపించడమేంటని అనుకుంటున్నారా అయితే మీకు అసలు విషయం తెలియాల్సిందే.

జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అనుకున్న అనుదీప్.. ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. బాడీ షేమింగ్, పంచ్ డైలాగులతో కామెడీ పండిస్తున్న చాలా మంది ఫిలిం మేకర్స్ కు అనుదీప్ తనదైన డీసెంట్ హాస్య శైలితో ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఏమాత్రం అశ్లిలత లేకుండా కామెడీ పండించటం అనుదీప్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. జాతి రత్నాలు సినిమా తరువాత అనుదీప్ తమిళ్ స్టార్ యాక్టర్ శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ అనే సినిమాను డైరెక్ట్ చేసాడు. తమిళ్- తెలుగు బై లాంగ్వేజికల్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించినంత విజయం సాదించలేకపాయింది.

ప్రిన్స్ సినిమా సక్సెస్ పై చాలా శలు పెట్టుకున్న అనుదీప్ ఈ సినిమా ఫ్లాప్ తో చిక్కుల్లో పడిపోయాయడు. ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్ళీ నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉన్న అనుదీప్ రవితేజ తో ఒక సినిమా కమిట్ అయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. రేపో మాపో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వస్తుందని అనుకుంటుండగా, రవితేజ తో కాకుండా మరో హీరో తో అనుదీప్ సినిమా చేయబోతున్నట్టు సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే అనుదీప్, తమిళ్ యాక్టర్ కార్తీకి ఇటీవలనే నేరేషన్ ఇచ్చాడంటూ తొందర్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా కూడా తన గత చిత్రం ప్రిన్స్ తరహా తమిళ్- తెలుగు బై లాంగ్వేజికల్ సినిమాగా తీయడానికి ప్లాన్ చేస్తునట్టు సమాచారం. అయితే బై లాంగ్వేజికల్ సినిమా సెంటిమెంట్ అనుదీప్ కు కలిసి రాకపోయినా పట్టువదలని విక్రమార్కుడీలాగా మళ్ళీ ప్రయత్నం చేస్తుండటంతో అనుదీప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు