KlinKara: కోడలు కోసం అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Allu Arjun’s surprise gift for daughter-in-law Klin Kara

మెగా ఫ్యామిలీలో గొడవలు.. అల్లు అర్జున్ – రామ్ చరణ్ మధ్య అసలు పడటమే లేదు. అంటూ తెగ రూమర్స్ వస్తాయి. కానీ, ఈ రూమర్స్‌ని ఏం పట్టించుకోకుండా, తమ అనుబంధాన్ని చాటుకుంటారు అల్లు అర్జున్ – రామ్ చరణ్.

ఇప్పుడు వీరి అనుబంధం గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, రామ్ చరణ్ – ఉపాసన జంటకు మ్యారేజ్ అయి 11 ఇయర్స్ తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఈ పాపకు క్లీన్ కారా కొణిదెల అనే పేరును కూడా పెట్టేశారు. మెగా ఫ్యామిలీలోకి క్లీన్ కారా అడుగు పెట్టిన రోజు నుంచి ప్రతి రోజు పండుగే అన్న చందంగా ఉంది. అలాగే మెగా వారసురాలికి గిఫ్ట్ లు కూడా బాగానే వస్తున్నాయి.

చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, తారక్ ఇప్పటికే క్లీన్ కారాకు గిఫ్ట్ లు పంపించారు. తాజాగా మెగా కంపౌండ్ లోని స్టార్ హీరో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్లిన్ కారాకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడట. క్లిన్ కారా పుట్టిన రోజు, సమయం, అలాగే పూర్తి పేరు అన్నింటిని బంగారం అక్షరాలతో ఒక ఫ్రేమ్ చేయించి ఇచ్చారట. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

ఎంతైనా అల్లు అర్జున్ కి క్లీన్ కారా కాబోయే కోడలే కదా… కోడలు కోసం ఆ మాత్రం కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వరా అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బన్నీ ఈ గిఫ్ట్ ఇవ్వడం వల్ల అయాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కావొచ్చు అంటూ మీమ్స్ వేస్తున్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో క్లీన్ కారా అడుగు పెట్టిన నాటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదో ఒక గుడ్ న్యూస్ వింటూనే ఉంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు