Superstar Rajinikanth with natural star Nani : తెర పైకి వచ్చిన మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్

Superstar Rajinikanth with natural star Nani

ముసురు వర్షంలో, రోడ్ పక్కన ఉండే ఒక చిన్న బడ్డీ కొట్టులో మిర్చి బజ్జి తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఊహించడానికే క్రేజీగా ఉన్న ఈ కాంబినేషన్ తరహాలో ఒక క్రేజీ మల్టి స్టారర్ కాంబినేషన్ కు సంబందించిన ఒక న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, జై భీం మూవీ ఫేం కె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. తలైవర్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఒక టాలీవుడ్ యంగ్ హీరో ప్రముఖ పాత్ర పోషించనున్నాడట. మరీ ఆ టాలీవుడ్ నటుడు ఎవరా.. అని అనుకుంటున్నారా ? అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని

అవును ! రజనీకాంత్ సినిమాలో నాని నటిస్తున్నడనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తోంది. అయితే సాదారణంగా అన్ని సినిమాలో కనిపించే ప్రధాన పాత్రలలాగా ఏదో తూ..తూ.. మంత్రంగా వచ్చి, కాసేపు కనిపించి పోయే పాత్ర కాదంట.. సినిమానే పూర్తిగా మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ అంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయని త్వరలో ఈ న్యూస్ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వస్తుందని సమాచారం.

- Advertisement -

రజనీకాంత్ లాంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ప్రతి యువ నటుడికి ఉంటుంది. అయితే అలాంటి అవకాశాలు ఎవరో ఒకరికి మాత్రమే వస్తాయి. కాగా ఆ గోల్డెన్ ఆపర్చునిటీ న్యాచురల్ స్టార్ నాని ని వరించింది. అయితే ప్రస్తుతానికి ఇది రూమరే అయినా త్వరలో నిజం అవుతుందని అందరు అనుకుంటున్నారు. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వేచి చూడాలి. ఇక నాని ప్రస్తుతం శౌర్యవ్ అనే డెబ్యూ డైరెక్టర్ తో హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రజినీకాంత్ లేటెస్ట్ సినిమా జైలర్ ఆగస్ట్ 10న రిలీజవుతున్న సంగతి తెలిసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు