Gadar: 90స్ వైబ్స్ తీసుకొచ్చిన “గదర్2”.. కానీ అప్పట్లా మెప్పిస్తుందా?

Gadar 2 trailer released

బాలీవుడ్ హీరోల్లో ఒక ప్రత్యేకమైన హీరో సన్నీ డియోల్. చాలా మంది హీరోలు కమర్షియల్, యాక్షన్ మూవీస్ తో మెప్పిస్తే ఇతను మాత్రం పీరియాడిక్ సినిమాలతో మెప్పించేవాడు. తాను చేసే కమర్షియల్ సినిమాల్లో కూడా దేశ భక్తిని పెంచే సీన్లు ఉండేలా సినిమాలు చేస్తాడు. ఇక సన్నీ డియోల్ నటించిన సినిమాల్లో “గదర్ ఏక్ ప్రేమ్ కథ” గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. 2001లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో పంజాబ్ లో జరిగిన గొడవల్లో తారా సింగ్ అనే వ్యక్తి సకీనా అనే పాకిస్తాన్ అమ్మాయిని కాపాడతాడు. సకీన ఫ్యామిలీ మొత్తం పాకిస్తాన్ కి వెళ్లిపోగా, సకీనా ని కాపాడిన తారా సింగ్ ఆమెను పెళ్లిచేసుకుంటాడు. ఒక సందర్భంలో పాకిస్థాన్ నుండి సకీనా ఫ్యామిలీ వచ్చి తనని తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ తారా సింగ్ తన భార్యని ఎలా రక్షించి తీసుకొచ్చాడన్నదే కథ.

ఆ రోజుల్లోనే 100కోట్లకి పైగా వసూలు చేసిన గదర్ సినిమా ఇండియాలోనే అత్యధికంగా ప్రేక్షకులు థియేటర్లో చూసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రీసెంట్ గా గదర్ రీ రిలీజ్ అయ్యి కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 22ఏళ్ళ తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా “గదర్2” వస్తుంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్, పాటలు మెప్పించగా, తాజాగా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

- Advertisement -

ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన అనిల్ శర్మ ఈ సినిమా కూడా డైరెక్ట్ చేసాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో తన భార్య ని తీసుకురావడానికి పాకిస్తాన్ వెళ్తే, ఇప్పుడు తన కొడుకుని తీసుకురావడానికి వెళ్తాడు. ఫస్ట్ పార్ట్ లో నటించిన సన్నీ డియోల్, అమీషా పటేల్ మినహా రెండో పార్ట్ లో అంతా కొత్త నటీనటులతో తీయడం జరిగింది. ఇక ట్రైలర్ర్ లో కథ నేపథ్యం మొత్తం చెప్పేయగా, స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం తేడాగా ఉంది. సినిమాని 100కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా, ట్రైలర్ లో మాత్రం అలా కనిపించడం లేదు.

ఇక కెమెరా వర్క్ క్వాలిటీ అంత ఇంప్రెస్సివ్ గా కనిపించడం లేదు. కానీ 90స్ ఆడియన్స్ కి ఎంతో ఫేవరేట్ అయిన ఆ సినిమా వైబ్స్ ఇందులోనూ ఉన్నాయి. అందువల్ల ఈ సినిమాలో ఎమోషన్స్ కి గనక జనాలకి కనెక్ట్ అయితే గదర్2 బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేయవచ్చు. మరి గదర్2 ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఆగష్టు11 న సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు