Pushpa Part 2 Crazy Rumor: పుష్ప – 2 లో శ్రీలీల ఐటమ్ సాంగ్..?

Pushpa Part 2 Crazy Rumor

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేయడంతో పాటు అల్లు అర్జున్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఓ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే రష్మిక కి కూడా బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం ఏడాదిగా బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక నటన ఒక ఎత్తు అయితే.. సమంత ఐటమ్ సాంగ్ మరో ఎత్తు అని చెప్పవచ్చు. “ఊ అంటావా మామ” అంటూ ఇండస్ట్రీని షేక్ చేసింది సమంత. ఇప్పుడు పుష్ప 2 లో కూడా అంతకుమించిన ఐటమ్ సాంగ్ ని సెట్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్. ఇందుకోసం సుకుమార్ ఓ స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఈ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.

తాజాగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారనే టాక్ నడుస్తుంది. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ బ్యూటీ, బిజీయేస్ట్ హీరోయిన్ శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ అయితేనే సినిమాకి మరింత హైప్ వస్తుందని భావించిన సుకుమార్ శ్రీలీలను సంప్రదించారట. అయితే ఐటమ్ సాంగ్ చేస్తే మళ్లీ హీరోయిన్ గా చేసే అవకాశాలు వస్తాయో రావో అని ఆలోచిస్తుందట శ్రీలీల. చూడాలి మరి ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ కి ఓకే చేస్తుందా..? లేదా..? అనేది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు