Naga Chaitanya Latest Movie Update: హిట్ డైరెక్టర్స్ తో జత కడుతున్న నాగ చైతన్య

Naga Chaitanya Latest Movie Update

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన పంథాను మార్చినట్టు తెలుస్తుంది. కెరీర్ బిగినింగ్ నుంచే హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నాగ చైతన్య ఇప్పుడు మాత్రం హిట్ మీద ఉన్న దర్శకులే కావాలంటున్నాడట.. మ్యాటర్ ఏంటంటే..

ఇటీవలనే కస్టడీ అనే బై- లాంగ్వేజికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగ చైతన్యకు మరోసారి పరాజయం తప్పలేదు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాగ చైతన్య చాలా ఆశలే పెట్టుకోగా, ఆయన అంచనాల్ని తలక్రిందులయ్యాయి. కృతి శెట్టి హీరోయిన్ గా, అరవింద్ స్వామి, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇంతవరకు కెరీర్ లో సాలిడ్ హిట్ లేని చై, ఇక పై రిస్క్ లు చేయదలుచుకోలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం నాగ చైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఇటీవలనే శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో నాగ చైతన్య రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో పని చేయానికి ఆసక్తి చూపిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా పై కూడా క్లారిటీ రానుంది.నిజానికి నాగ చైతన్య నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడలతో ఒక సినిమా చేయవలసి ఉంది కానీ ఇటీవలనే ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఉగ్రం ఆశించినంత విజయం సాదించకపోవటంతో నాగ చైతన్య విజయ్ కనకమేడల ప్రాజెక్ట్ ను వాయిదా వేసి రామ్ అబ్బరాజు ప్రాజెక్ట్ ను ఒకే చేయనున్నాడట. దీన్నిబట్టి చూస్తే నాగ చైతన్య ఇప్పటి నుంచి కెరీర్ విషయంతో జాగ్రత్త వహిస్తున్నడనిపిస్తోంది. మరీ ప్రస్తుతం హిట్ లో ఉన్న దర్శకులతో జతకడుతున్న నాగ చైతన్యకు ఈ దర్శకులైన హిట్స్ ఇస్తారో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు