Ustad Trailer: అంతా బాగుంది గాని? ఏదో కొడుతుంది?

Ustad trailer released

టాలీవుడ్ లో విభిన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్న హీరో “శ్రీ సింహ కోడూరి”. రీసెంట్ గా “భాగ్ సాలె” సినిమాతో వచ్చి ఆడియన్స్ ని పలకరించిన ఈ హీరో ఇప్పుడు “ఉస్తాద్” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో వస్తున్నాడు. వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో రజిని కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహించాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని డీసెంట్ రెస్పాన్స్ దక్కించుకుంది.

ఉస్తాద్ ట్రైలర్ ని గమనించగా ఈ సినిమాలో హీరో అల్లరి చిల్లరగా తిరిగే దశ నుండి ఒక ఫైలెట్ గా ఎలా మారాడన్నదే కథ నేపథ్యం. ఇక ఈ సినిమా ద్వారా శ్రీ సింహా యాక్టింగ్ పరంగా మరో మెట్టు ఎక్కుతాడని అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ దొరికిందని అనిపిస్తుంది. అయితే సినిమాలో హీరోకి తన బైక్ కి మధ్య మంచి బాండింగ్ చూపించారు. మరి కథ విషయంలో అది కీలకమై ఉండొచ్చు. ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్ హీరోకి ఫ్లైట్ నడపడం నేర్పించే ట్రైనర్ గా ప్రత్యేక పాత్రలో నటించారు.

- Advertisement -

ఓవరాల్ గా ట్రైలర్ మంచి క్వాలిటీతో ఉండి ఆకట్టుకుంది. కానీ ఎయిర్ పోర్ట్ సీన్స్, ఫ్లైట్ లోపలి సీన్స్ చూస్తుంటే అదే ఈ సినిమా క్లైమాక్స్ అని ఈజీ గా తెలిసిపోతుంది. బహుశా ఫ్లైట్ లో ప్యాసింజర్స్ ని కాపాడే సిట్యుయేషన్ కావచ్చు. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో ఇంతకు ముందే చూసాం. కానీ ఈ సినిమాలో ఆ సీన్ ని ఎంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే తో నడిపించారనేదే ఇంపార్టెంట్. అక్కడ డైరెక్టర్ సక్సెస్ అయితే సినిమా ఆటోమేటిక్ గా హిట్ అవుతుంది. ఇక ఉస్తాద్ సినిమా ఆగష్టు 12 న రిలీజ్ అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు