Nithya Menen depression rumours : డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన నిత్యా మీనన్

Nithya Menen depression rumours

హమ్మయ్య..! మొత్తానికి కన్నడ కుట్టి నిత్యా మీనన్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది. నిత్యా మీనన్ ఏంటి? డిప్రెషన్ లోకి వెళ్లడం ఏంటి ? అని అనుకుంటున్నారా.. అవును ఇటీవలనే ఆమె ఒక విషయమై చాలా డిప్రెషన్ గురయ్యింది. అయితే చాలా మందికి ఈ విషయం తెలీదు. వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో క్యారెక్టర్ బట్టి సినిమాలు చేసే వాళ్ల కన్నా గ్లామర్ రోల్స్ చేయడానికి ఇష్టపడే వాళ్లే ఎక్కువ. కానీ హీరోయిన్ నిత్యా మీనన్ మాత్రం గ్లామర్ పాత్రల కంటే కూడా ఆమె సినిమాలలో తన పాత్ర ప్రాధాన్యతను బట్టే సినిమాలు కమిట్ అవుతుంది. అందుకే ఆమె చేసేనవి, చేసేవి తక్కువ సినిమాలే అయిన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

- Advertisement -

గతేడాలి వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలో నటించిన నిత్యా మీనన్ ఈ సినిమా తరువాత ఇప్పటి వరకు వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు. అయితే ఈమె సినిమాలు చేయకపోవడానికి ప్రధాన కారణం గత కొద్దీ రోజులుగా నిత్యా మీనన్ వాళ్ళ అమ్మమ్మ అనారోగ్యంగా ఉండటమే. అమ్మమ్మ అంటే నిత్యా మీనన్ కు చాలా ఇష్టం అందుకే తనని ఇన్ని రోజులు దగ్గరుండి చూసుకుంది. అయితే ఇటీవలనే ఆమె(నిత్యా మీనన్ వాళ్ళ అమ్మమ్మ) కాలం చేసింది. దాంతో నిత్యా మీనన్ మొన్నటి వరకు డిప్రెషన్ లోకి వెళ్ళింది. అమ్మమ్మ మీద ప్రేమను వ్యక్తపరుస్తూ ఇంస్టాగ్రామ్ అంత ఎమోషల్ పోస్ట్ లతో నింపింది.

కాగా ఇటీవలనే ఆమె డిప్రెషన్ నుంచి కోలుకున్నట్టు తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ లను బట్టి తెలుస్తుంది. ఇటీవలనే ఆమె సత్యజిత్ రే డైరెక్షన్ లో వచ్చిన చారులత అనే క్యారెక్టర్ అవుట్ ఫిట్ తో నిత్యా మీనన్ ఫోటో షూట్ లో పాల్గొని, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఆ పిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆమె ఈ పిక్స్ సరదాగా తీయించుకుందో.. లేక మరి ఏదైనా సినిమా కోసం తీయించుకుందో తెలియాల్సి ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు