BRO: పకోడీ గాడికి ముందు సలహా ఇవ్వు.. చిరుకి ఘాటు కౌంటర్?

AP Ministers strong counter to Chiranjeevi

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సినిమాలపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర జేస్తుందని తెలిసిందే. కావాలనో లేక యాధృచ్చికమో తెలియదు గాని, సినిమా ఇండస్ట్రీపై, సినిమా వాళ్లపై అక్కడి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ 100ఇయర్స్ వేడుకకి వచ్చినపుడు పలు పార్టీల కార్యకర్తలు, కొందరు పేటీఎం బ్యాచ్ లు కలిసి ఆయనపై ఎన్ని విమర్శలు చేసారో తెలిసిందే.

లేటెస్ట్ గా మొన్న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అయినపుడు సదరు రాజకీయమంత్రిని సినిమాలో ఇమిటేట్ చేసి అవమానించారని ఆరోపణలు చేసారు. దీనిపై ఏకంగా ఆ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వైరల్ చేసారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ, తాము ఎవర్ని అవమానించలేదని కో ఇన్సిడెంట్ లో డ్రెస్ లు ఒకటైనంత మాత్రాన వాళ్ళని ఇమిటేట్ చేసినట్లు కాదని అన్నారు. అయితే బ్రో సినిమా హడావిడి అయిపోవడంతో ఇప్పుడు వేరే సినిమాలపై పడుతున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య200 ల రోజుల వేడుకలో బ్రో సినిమాపై ఏపీ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ, ” ప్రత్యేక హోదా గురించి కానీ , రోడ్ల నిర్మాణం గురించి కానీ ప్రాజెక్టులు గురించి కానీ పేదవారికి కడుపు నింపే విషయం కానీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి కానీ, ఏపీ పొలిటికల్ లీడర్స్ కలుగజేసుకోవాలి, అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి ” అంటూ అయన అన్నారు.

- Advertisement -

ఈ కామెంట్స్ బ్రో సినిమా ఇష్యూ గురించే అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే స్పీచ్ లో ఇలా అన్నారో లేదో వెంటనే, ఆ పార్టీ నేతలు ఘాటుగా రిప్లై లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక లేటెస్ట్ గా ఆ పార్టీ మినిస్టర్లు ఇద్దరు దారుణంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అందులో ఒక మినిష్టర్ మాట్లాడుతూ, “మాకు చెప్పే ముందు పకోడీ గాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా? సినిమాల్లో డాన్సులు, ఫైట్లు చేసుకుందాం, మనకెందుకు ఈ రాజకీయాలు” అని చెప్పమను” అని అన్నాడు. ఇది పవన్ ని ఉద్దేశించే అన్నాడని తెలుస్తూనే ఉంది.

ఇక ఆ వెంటనే మరో మంత్రి మాట్లాడుతూ మా అభిమాన నటుడు చిరంజీవి అని మొదలుపెడుతూనే గట్టి కౌంటర్ వేశాడు. సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబుని, రామ్ చరణ్ ని, రవితేజని, ప్రభాస్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని ఇలా వేరే హీరోల గురించి గాని, ఏదైనా సినిమా టాపిక్ గురించి గాని మాట్లాడమా, అని అంటూనే, బ్రో సినిమాలో తమ రాజకీయ నాయకుడిని అవమానించారు కాబట్టే దానికి కౌంటర్ వేసాము అని చెప్పుకొచ్చారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ కి సంతృప్తినిచ్చినా, ఆ పార్టీ నేతలకు మాత్రం వ్యతిరేకం అయిపోయాడు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు రిలీజ్ కాబోతున్న భోళా శంకర్ సినిమాపై పడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మెగాఫ్యాన్స్ కూడా అన్నిటికీ తెగించి సిద్ధంగా ఉన్నారని, చిరుని గాని, పవన్ ని గాని టార్గెట్ చేస్తే తాము ఏం చేయాలో అది చేసి చూపిస్తామని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు