Raghuvaran B.tech: “గ్యాప్ ఇవ్వండయ్యా”.. అంటున్న మూవీ లవర్స్..

Raghuvaran B. Tech Re Release Update

టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలు మరీ ఎక్కువైపోతున్నాయి. రెగ్యులర్ సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు వారానికో అనౌన్స్మెంట్, పది రోజులకో సినిమా రిలీజ్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. అందులో కొన్ని రీ రిలీజ్ లో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. మరికొన్ని అంతగా ఆడట్లేదు. ఇక రీసెంట్ గా డబ్బింగ్ సినిమా అయిన “సూర్య సన్ ఆఫ్ కృష్ణన్” రీ రిలీజ్ అయినపుడు కూడా ఏ రేంజ్ లో ఫ్యాన్స్ హంగామా చేసారో తెలిసిందే.

ఈ సినిమా ఏకంగా తెలుగు స్టార్ హీరోల సినిమాల లెవెల్లో రికార్డు వసూళ్లు సాధించింది. ఇక ఈ విషయమై స్పందిస్తూ హీరో సూర్య అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పటికి సిటీ ఏరియాల్లో కొన్ని థియేటర్లలో ఆ సినిమా రన్ అవుతుంది. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా మరో డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఆ సినిమాయే కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన “రఘువరన్ బిటెక్”. ఆగష్టు18న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఎఫెక్ట్ వల్లే ఈ సినిమా కూడా రీ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారని తెలుస్తూనే ఉంది.

కానీ ఆడియన్స్ కూడా దీనికి రెడీ అవ్వాలిగా? ఇలా అన్ని సినిమాలు వెంటవెంటనే రీ రిలీజ్ చేస్తూపోతే ఇక రెగ్యులర్ సినిమాలు ఎప్పుడు చూడాలి? అంటూ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ కౌంటర్లు వేస్తున్నారు. మరి కొందరైతే రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తక్కువ రేట్లకి టికెట్లు విక్రయిస్తే సినిమా చూస్తామని లేదంటే పట్టించుకోమని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య రీ రిలీజ్ లు కూడా వారానికో సినిమా అంటూ టూ మచ్ గా వస్తున్నాయని కామన్ ఆడియన్స్ భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు