Venky: ఆ ఒక్క ట్రాక్ చాలు. రీ రిలీజ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి?

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా రిల్ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల వరకు పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అయ్యేవి. అందులోనూ బ్లాక్ బస్టర్ అయిన మూవీలే రీ రిలీజ్ అయ్యేవి. కానీ ఈ సంవత్సరం రీ రిలీజ్ అయిన “ఆరెంజ్” సినిమాతో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసారు. అప్పట్లో డిజాస్టర్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీ, ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇక తాజాగా రీ రిలీజ్ అయిన చిన్న సినిమా “ఈ నగరానికి ఏమైంది” భారీ కలెక్షన్లతో రీ రిలీజ్ సినిమాల్లోనే టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ఇక ఈ సినిమా రెస్పాన్స్ తో అన్ని రకాల సినిమాలు కూడా రీ రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ లో ఒక బ్లాక్ బస్టర్ కామెడీ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అదే మాస్ మహారాజ్ రవితేజ నటించిన “వెంకీ” చిత్రం.

రవితేజ శ్రీనువైట్ల కాంబో లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక వెంకీ లో సినిమా మొత్తం ఒక ఎత్తు, ట్రైన్ కామెడీ ట్రాక్ ఒక ఎత్తు. నలభై నిమిషాలకి పైగా ఉండే ఆ కామెడీ ట్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి 90 శాతం కారణం అనే ఒప్పుకొని తీరాల్సిందే, అలా ఉంటుంది ఆ ఎపిసోడ్. సినిమా రీ రిలీజ్ అయితే చూడాలా వద్దా అని అనుకునే వారికీ ఈ ఒక్క ట్రైన్ ఎపిసోడ్ చాలు.

- Advertisement -

ఎప్పుడైతే ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందని ప్రకటించారో, రవితేజ ఫ్యాన్స్ తో పాటు, వెంకీ సినిమా కల్ట్ ఫ్యాన్స్ ఆత్రుతతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే వెంకీ సినిమా డిసెంబర్30న రీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు. అంటే సినిమా రావడానికి ఇంకా చాలా 5నెలలు టైమ్ ఉంది. కాని ఎప్పుడు రీ రిలీజ్ చేసినా సరే వెంకీ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా అన్ని కుదిరితే ఈ సినిమా ఖుషి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని వెంకీ కల్ట్ ఫ్యాన్స్ అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు