LEO :ఒక పద్ధతి.. ఒక ప్లానింగ్..కేర్ అఫ్ సక్సెస్ !

Lokesh Kanagaraj success secret

ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఒకరైన లోకేష్ కనకరాజ్ గురించి షాకింగ్ కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఈయన తీసింది కేవలం4 చిత్రాలే అయినప్పటికి ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను సాధించాయి. దాంతో ఈ డైరెక్టర్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి అందరిలో ఆసక్తి మొదలైంది.

అయితే ఇంత సక్సెస్ లోకేష్ కనకరాజ్ కు ఎలా సాధ్యమైంది? టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ పరిశ్రమలలో ఉండే టాప్ స్టార్స్ ఈయనతో పని చేయడం ఇష్టపడటానికి గల కారణాలేంటి? అసలు ఈయన సక్సెస్ కు సీక్రెట్ ఏంటా.. ప్రశ్నలకు ఎట్టకేలకు సమాధానం దొరికింది.

ప్రస్తుతం కోలీవుడ్ టాప్ స్టార్ అయిన తలపతి విజయ్ తో లియో సినిమా చేస్తున్న లోకేష్ కనకరాజ్. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాడు. దాదాపు 125 రోజుల పాటు జరిగిన ఈ సినిమా టాకీ పార్ట్ ఇటీవలనే కంప్లిట్ అయింది. వారసుడు సినిమా షూటింగ్ లో ఉండగానే లియో సినిమా ప్రాపర్ ప్రి ప్రొడక్షన్ వర్క్ కంప్లిట్ చేసిన లోకేష్ కనకరాజ్ ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే లియో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. కేవలం 125 రోజుల వ్యవధిలో లియో లాంటి హై ఎండ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

- Advertisement -

లోకేష్ కనకరాజ్ మొదటి సినిమా అయిన నగరం సినిమాని ఆయన 45 రోజుల్లో ఫినిష్ చేయగా, మాస్టర్ సినిమా కోసం 129 డేస్, ఖైదీ 62 నైట్స్ , విక్రమ్ సినిమాను 110 రోజుల్లో పూర్తి చేసాడు. ప్రతి సినిమాకు ముందు ఒక పెద్దది, ఒక ప్లానింగ్ అన్ని ముందే చేసుకొని, స్టార్స్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సినిమాని ఫినిష్ చేయడం లోకేష్ కనకరాజ సీక్రెట్ అయితే ఈయన పడిన కష్టానికి వచ్చే సక్సెస్ ఆయనకు బోనస్ అని చెప్పాలి. రాజమౌళి లాంటి పెద్ద దర్శకులు సైతం ఒక సినిమాని తెరకెక్కించాడని సంవత్సరాల కొద్దీ సమయం తీసుకుంటుంటే లోకేష్ మాత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే సినిమా ఫినిష్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈయన లేటెస్ట్ సినిమా లియో వచ్చే అక్టోబర్ 19న రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.

heck Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు