Baby: విమర్శలు డబ్బులు

ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ సినిమాలను చూస్తున్నప్పుడు కొన్ని విపరీతంగా నచ్చుతాయి. ఈ సినిమా బాగుంది హిట్ అనుకునే తరుణంలో ఆ సినిమా జాతకం మారిపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంది. మరికొన్ని సినిమాలు ఉంటాయి. ఆయా సినిమాలకు విమర్శలతో పాటు డబ్బులు, ఆడియన్స్ విపరీతంగా వస్తారు. ఒకసారి అలాంటి సినిమాల ప్రస్తావన వస్తే.

1.RX100
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం Rx100. ఈ సినిమాను మొదట మల్టిఫ్లెక్స్ లో చూసిన ఆడియన్స్ అంతా కూడా అనేక విమర్శలు గుప్పించారు. ఒక హీరోయిన్ కేరక్టర్ ని అలా ఎలా చూపిస్తావు అంటూ మహిళ సంఘాలు రోడ్లు ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏదేమైనా ఆ వేడి అంతా గట్టిగ ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది. తరువాత మాములు… ఎట్టకేలకు ఒక వర్గం ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.

- Advertisement -

2.ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాధ్ గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కేవలం హీరోలకి మాత్రమే అభిమానులు ఉంటారు అనుకుంటే, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళి లాంటి వాళ్ళు డైరెక్టర్స్ కి కూడా అభిమానులు ఉంటారని ప్రూవ్ చేసారు. ఇంకా పూరి సినిమా అంటే యూత్ లో మంచి క్రేజ్, టెంపర్ తరువాత చాలా ఏళ్ళు హిట్ సినిమాకి నోచుకోలేదు పూరి. తన సినిమాల్లో హీరోలతో అద్భుతమైన డైలాగ్స్, ఫిలాసఫీ చెప్పించే పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి తెలంగాణ సామెతలు చెప్పించాడు. ఆ సినిమాను చూసినప్పుడు కూడా కొందరు “మార్ ముంత చోడ్ చింత” అనుకున్నారు కట్ చేస్తే ఆ సినిమా కోట్లు కొల్లగొట్టింది.

3.బేబీ
నేషనల్ అవార్డు గ్రహీత సాయి రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయ్యాల్సిన అవసరం లేదు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, కలర్ ఫోటో వంటి సినిమాలతో సాయి రాజేష్ సుపరిచితమే. ఇక తన సెటైరికల్ పంథాను పక్కన పెట్టి రాజేష్ తెరకెక్కించిన సినిమా బేబీ. టీజర్ నుంచే ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజై, ఇదొక నిబ్బా నిబ్బి స్టోరీ అని, టూ మచ్ ల్యాగ్ అని ఇప్పుడు చాలా విమర్శలను ఎదుర్కొంటుంది. కేవలం విమర్శలు మాత్రమే కాకుండా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మంచి కలక్షన్స్ ను కొల్లగొడుతుంది.

కేవలం ప్రశంసలు కి మాత్రమే పరిమితం అయ్యే కొన్ని సినిమాల మధ్యలో విమర్శలను కూడా ఎదుర్కుంటూ డబ్బులు కొల్లగొట్టొచ్చు అని ఈ సినిమాలు నిరూపించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు