DON3: “డాన్” మళ్ళీ వచ్చేస్తున్నాడు? ఇంతకీ ఎవరో?

Don3 Movie Announcement

బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు రెగ్యులర్ గా వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ సినిమాలు అన్ని జోనర్లలోనూ తీయడం బాలీవుడ్ వాళ్ళకి అలవాటు. ఇక మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్న గదర్2, OMG2 కూడా సీక్వెల్స్ కావడం విశేషం. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన “డాన్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్(1978) కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇక దీనికి సీక్వెల్ గా 2011 లో షారుఖ్ ఖాన్ నే హీరోగా పెట్టి డాన్2 కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలను బాలీవుడ్ ప్రముఖ హీరో, డైరెక్టర్, సింగర్ అయిన “ఫర్హాన్ అక్తర్” డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళ తర్వాత డాన్ సిరీస్ లో మరో సినిమా రాబోతుందంటూ చిత్ర డైరెక్టర్ ఫర్హాన్ అక్తరే స్వయంగా ప్రకటించాడు.

అయితే ఈ సినిమాలో హీరోగా షారుఖ్ ఖాన్ కాకుండా మరో బాలీవుడ్ స్టార్ హీరోగా నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఆ స్టార్ హీరో రణవీర్ సింగే అంటూ బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. రణవీరే హీరో అని అఫిషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఫర్హాన్ అక్తర్ వేసిన అనౌన్స్మెంట్ లో ఇటు రణవీర్ అని చెప్పలేదు, అటు షారుఖ్ అని కూడా చెప్పలేదు. అందువల్ల ఈ కన్ఫ్యూజన్ ఎక్కువైంది. తొందర్లోనే డాన్3 కి సంబంధించి డిటైల్స్ చెప్తామని డైరెక్టర్ చెప్పడం జరిగింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు