Koratala siva: శరవేగంగా జరుగుతున్న “దేవర” షూట్!

“Devara” shoot is going on fast!

దేవర టీమ్ స్పీడ్ పెంచారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఎన్టీఆర్ RRR తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక ఆచార్య డిజాస్టర్ తరువాత కొరటాల శివ కూడా ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసిమీదున్నాడు. అందుకే ఆరు నెలల టైం తీసుకుని మరీ స్క్రిప్టులో చేంజ్ చేసి సినిమా తీస్తున్నాడు.

ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా 50శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా, తాజాగా హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో వేసిన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు, సైఫ్ అలీఖాన్ కి సంబంధించిన సీన్లను తీస్తున్నారు. బహుశా వీరి మధ్య ఫైట్ సీన్ షూటింగ్ జరగవచ్చని నెటిజన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ ఈ సెట్స్ లో ముందునుండి ఉండగా, సైఫ్ మాత్రం ఈరోజే షూటింగ్ లో జాయిన్ అయ్యాడని అంటున్నారు. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ ముంబై నుండి హైదరాబాద్ లో ఈరోజే ల్యాండ్ అయినట్టు ఎయిర్ పోర్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా సముద్ర తీరా ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ సినిమాపై ఓ రేంజ్ హైప్ ని తీసుకురాగా, టీజర్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు