Prem kumar: ఏవి లేవనుకున్నారు? కానీ ఆ ఇద్దరు హీరోలు వస్తున్నారు!

Prem Kumar, Mr. Pregnant is releasing on August 18

టాలీవుడ్ లో ఈ వారం రెండు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ కాగా, మరొకటి రజినీకాంత్ జైలర్. ఇక ఈ రెండు కాక శ్రీ సింహ నటించిన చిన్న సినిమా ఉస్తాద్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ మూడు వరుసగా 10,11,12 తేదీలలో రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కాబట్టి ఆ తరువాతి వారంలో ఏ చిన్న సినిమా కూడా రిలీజ్ కాదు అని అనుకున్నారు.

పైగా అదే రోజు రిలీజ్ అవ్వాల్సిన ఆదికేశవ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కానీ చిత్రంగా రెండు సినిమాలు ఆగష్టు18 న రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అది కూడా రెండు చిన్న సినిమాలే కావడం ఆశ్చర్యం. ఇక వాటిలో ఒకటి సంతోష్ శోభన్ హీరోగా నటించిన “ప్రేమ్ కుమార్” కాగా, మరొకటి బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన “మిస్టర్ ప్రెగ్నెంట్”. ఈ రెండు సినిమాలు ఆగష్టు 18న రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఈ రెండు కామెడీ నేపథ్యం ఉన్న సినిమాలే అయినా, మార్కెట్ లో వీటి మీద పెద్దగా బజ్ లేదు. ట్రైలర్లు బాగుండి మెప్పించినా, ప్రస్తుతం ఈ వారం రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల పైనే ఆడియన్స్ దృష్టి ఉంది. ఇక ఈ చిన్న సినిమాలు రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ లో కూడా, అంటే ఆగష్టు25న గాండీవధారి అర్జున, బెదురు లంక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఈ సినిమాల మధ్య హైప్ లేని ఈ చిన్న సినిమాలు రిలీజ్ చేయడం ఎందుకు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

ఎందుకంటే పోటీలో ఉన్న పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేస్తే పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సినిమాలు పోస్టుపోన్ చేసి వచ్చే నెలలో రిలీజ్ చేసుకుంటే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. మరి ఈ చిన్న హీరోలు అనుకున్న సమయానికి వస్తారా లేదా వెనక్కి తగ్గుతారా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు