Megastar’s BholaaShankar: స్పీడ్ మీదున్న జైలర్ – భోళాకి గట్టి పోటీ..!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా కూడా ఆగస్టు 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా వస్తున్న భోళాశంకర్ సినిమా మీద మొదటి నుండి పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. డిజాస్టర్ ట్రాక్ ఉన్న మెహర్ రమేష్ డైరెక్టర్ కావటంతో మెగా ఫ్యాన్స్ లో సైతం ఈ సినిమా మీద పెద్దగా హోప్స్ లేకుండా పోయాయి. ఈ సినిమా టీజర్ మొదలుకొని ట్రైలర్, సాంగ్స్ వరకు ఏ ఒక్కటి కూడా సినిమా మీద ఆశించిన స్థాయిలో ఆసక్తి పెంచలేకపోయాయి. సినిమా మీద ఉన్న నెగిటివ్ వైబ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా బిజినెస్ ని కూడా వీలైనంత తక్కువ రేంజ్ లో చేశారని సమాచారం అందుతోంది.

మరో ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇటీవల కాలంలో సరైన హిట్ లేకపోయినప్పటికీ జైలర్ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో జైలర్ సినిమాతో సూపర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ కి తగినట్టుగా ఓవర్సీస్ లో జైలర్ ఇప్పటికే హాఫ్ మిలియన్ దాటి వన్ మిలియన్ దిశగా దూసుకుపోతుంది.

జైలర్ ఓవర్సీస్ లో దూసుకుపోతుండగా భోళాశంకర్ మాత్రం కేవలం లక్ష డాలర్లు దాటి నత్త నడకన నడుస్తోంది. ఇప్పటిదాకా మినిమమ్ హైప్ కూడా సొంతం చేసుకోలేకపోయిన భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటే తప్ప జైలర్ పోటీని తట్టుకొని నిలబడే పరిస్థితి ఉండదు. మరి, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, గ్రేస్ మాత్రమే పాజిటివ్ అంశంగా కనిపిస్తున్న నేపథ్యంలో భోళాశంకర్ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు