Samyuktha Menon : అదొక్కటే మిగిలింది..

Samyuktha Menon career

ఇటీవల కాలంలో అన్నీ సూపర్ హిట్ సినిమాలలో నటించి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ గురించి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ అతి కొద్దీ రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో సంయుక్త మీనన్ చేసిన సినిమాలన్నీ ఒకటిని మించి ఒకటి సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అయితే నిన్న మొన్నటిదాకా వరుస సినిమాలతో, సక్సెస్ లతో బిజీ గా ఈ భామ స్పీడ్ కు సడన్ బ్రేక్ పడింది. హుటాహుటిన వచ్చిన స్టార్ స్టేటస్ అంత మూడునాళ్ళ ముచ్చట గానే అయిపొయింది. బీమ్లా నాయక్ సినిమా తరువాత వెంటనే బింబిసార, సార్, విరూపాక్ష సినిమాల సక్సెస్ లతో బిజీ బిజీ గా మారిన సంయుక్త మీనన్ ప్రస్తుతం సినిమాలేవీ లేక ఖాళీగా ఉంటోంది. ఫ్లాప్ లలో ఉన్న హీరోయిన్స్ కూడా అడపాదడపా అవకాశాలు వస్తున్న క్రమంలో సంయుక్త మీనన్ అన్నీ సినిమాలు సూపర్ హిట్ కొట్టిన ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలేవి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ప్రస్తుతం సంయుక్త మీనన్ తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా డెవిల్ మినహా వేరే సినిమాలేవీ చెయ్యట్లేదు. నవీన్ మేడారం డైరెక్షన్ లో రాబోతున్న ఈ డెవిల్ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. రేపో మాపో ఈ సినిమా కూడా రిలీజైతే సంయుక్త చేతిలో చెప్పుకోడానికి కూడా ఒక్క సినిమా కూడా ఉండదు. అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తున్న కూడా.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయమే పడుతుంది. మరి అప్పటి వరకు ఈ కేరళ కుట్టి పరిస్థితి ఏంటో అర్థం కావడటం లేదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmifyASHW

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు