Samyuktha: మెగా హీరోకు లక్కీ క్వీన్‌గా మారిపోయింది కదా..

ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న అందాల భామ సంయుక్త మీనన్. ఈమె నటించింది కొన్ని సినిమాలే అయినా, గోల్డెన్ లెగ్ అనే పేరు సంపాదించుకుంది. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో గోల్డెన్ లెగ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఈమెకు బింబిసారా, సార్ వంటి సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. ఈ సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. దీంతో లక్కీ బ్యూటీ అంటూ సంయుక్తను అభినందించడం మొదలుపెట్టారు. ఆకట్టుకునే రూపం, మంచి ఫిజిక్, నటనలో మంచి ప్రావీణ్యం ఉన్న సంయుక్త మీనన్ అందాల ఆరబోత విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా ముందే ఉంటుంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చి పడుతున్నాయి. తాజాగా సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్షతో మరో సక్సెస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

దీంతో ఈ గోల్డెన్ బ్యూటీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో సంయుక్త ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అంటూ ప్రతి ఒక్కరు ఈమె పై ప్రశంసలు కురిపించడమే కాకుండా దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కడుతున్నారు. పలువురు నిర్మాతలు ఈమెని తమ సినిమాలలోకి తీసుకోవడానికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

చాలా కాలం తర్వాత సాయిధరమ్ తేజ్ కి సక్సెస్ దక్కిందంటే అది సంయుక్త మీనన్ వల్లే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సంయుక్త.. ఒక టాలీవుడ్ కే కాదు, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి కూడా లక్కీ క్వీన్ అని అంటున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన “డెవిల్” చిత్రంలో నటిస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు