Esther Anil: గ్లామర్‌తో యూత్‌ని ఆకర్షిస్తున్న ఒకప్పటి బాలనటి

2014 లో దృశ్యం సినిమా తో తెలుగు లో బాలనటిగా పరిచయమైన ఎస్తర్ అనిల్, అందులో అను గా తండ్రి చాటు బిడ్డగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కేరళ కి చెందిన ఈ అమ్మాయి మళయాలం లో 2010 లో నల్లవన్ సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో బాలనటిగా చేసింది. 2013 లో మోహన్ లాల్ నటించిన దృశ్యం లో ఆయన కూతురిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమానే తెలుగు లో వెంకటేష్ అదే పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఎస్తేరే కూతురి పాత్రలో నటించింది. ఆ తర్వాత 2021 లో దృశ్యం సీక్వెల్ కూడా వచ్చి సూపర్ హిట్ అయింది. ఆ సీక్వెల్ లో ఎస్తర్ ఒక టీనేజేర్ గా కనిపించింది.

ఈ సినిమాల తర్వాత “ఎస్తర్ అనిల్” హీరోయిన్ గా మారింది. 2019 ల ‘ఓలు’ అనే మలయాళం సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత పలు చిన్న సినిమా ల్లో హీరోయిన్ గా నటిస్తూ ఇతర సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ లోనూ నటిస్తుంది. ఇక ఎస్తర్ అనిల్ అప్పుడప్పుడు తన ఫోటో షూట్ ల తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మూవీ ఆఫర్స్ కోసం తన గ్లామర్ షో తో ఇన్స్టా గ్రామ్ లో సందడి చేస్తుంది. లేటెస్ట్ గా ఎస్తర్ అనిల్ ఇన్స్టా గ్రామ్ లో చేసిన పోస్ట్ లు వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ లో రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసి పోతుంది. ప్రస్తుతం మలయాళం చిత్రాల్లో నటిస్తున్న ఎస్తర్ తెలుగు సినిమాల్లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు