Soniya Singh: ఇంతకు ఆమె ఎవరు… ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మెగా అభిమానులతో పాటు, సాయిధరమ్ తేజ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సోనియా సింగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సోనియాసింగ్ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో బాగా పాపులారిటీ సంపాదించిన నటి. యమలీల సీరియల్ తో బుల్లితెరపై మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు విరూపాక్షతో వెండితెరపై ఎంట్రీ ఇస్తుంది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన ఈ చిత్రంలో సోనియా ఓ కీలక పాత్ర పోషించింది.

తను నటించిన వెబ్ సిరీస్ లో ఎక్కువగా పవన్ సిద్ధూకు జోడిగానే కనిపించింది. ఈ ఇద్దరి జంట తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు, సిద్దుపై తనకున్న ప్రేమని టీవీ, సోషల్ మీడియా వేదికగా బయట పెడుతుంటుంది. ఇక సోనియా సింగ్ 1998లో మార్చి 31 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటుంది. ఏ స్కూల్లో చదువుకుందో, ఏ కాలేజీలో చదువుతుందో తెలియదు గానీ బీటెక్ చదివింది. యోగా చేయడం, ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం బాగా అలవాటు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు