Tollywood: ఉపాసన సీమంతం ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల జంట గురించి తెలియని వారు ఉండరు. అయితే రామ్ చరణ్ దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్లు పొందుతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంట్లోకి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గర్భంతో ఉన్న ఉపాసనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి గైనకాలజిస్టును తీసుకురానున్నారు. తాజాగా ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్ వంటకాన్ని తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఇదిలా ఉంటే, మరికొన్ని నెలల్లో ఉపాసన ప్రసవం కానున్న నేపథ్యంలో మెగా ఇంట పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ బేబీ షవర్ ఫంక్షన్ జరిగింది.

ఈ బేబీ షవర్ పార్టీలో గులాబీ రంగు డ్రెస్ ధరించింది ఉపాసన. చూడటానికి ఈ డ్రెస్ ఏంతో గ్రాండ్ గా ఉండటంతో అందరూ ఈ డ్రెస్ తాలూకు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ డ్రెస్ నీడిల్ థ్రెడ్ బ్రాండ్ కి చెందినదని… దీని ధర సుమారుగా ఒక లక్ష రూపాయలు అని తెలిసింది. అంతేకాదు ఉపాసన డెలివరీ టైం లో చరణ్ పక్కనే ఉండాలని షూటింగ్లకు మూడు నెలల గ్యాప్ ఇచ్చాడట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు