Super Star’s Jailer: రజిని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా..?

Super Star’s Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ ( RajiniKanth ) నెల్సన్ కాంబినేషన్లో రూపొందిన జైలర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా గ్లిమ్ప్స్, సాంగ్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.రజినీకాంత్ స్టైల్ అండ్ స్వాగ్ తో ఆకట్టుకున్న ఈ ట్రైలర్లో ఎమోషన్, యాక్షన్ ని బ్యాలెన్స్ చేసి రూపొందించారు. అయితే, గ్లిమ్ప్స్, సాంగ్ తరహాలోనే తమిళ్, తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. రజినీకాంత్ కి జోడిగా రమ్యకృష్ణ నటించింది ఈ సినిమాలో. రజినీకాంత్ లుక్స్ ఈ సినిమాకి ప్లస్ అవనున్నాయని అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.

ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేని సూపర్ స్టార్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. నెల్సన్ గత చిత్రం బీస్ట్ బ్లాక్ బస్టర్ కావటంతో జైలర్ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా చిరంజీవి భోళాశంకర్ కి గట్టి పోటీ ఇచ్చేలాగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రజినీకాంత్ స్టైల్ అని అనిరుద్ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. తన ఏజ్ కి తగిన క్యారెక్టర్లో రజిని కనిపించటం ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ కి రోబో 2.0 తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి, చిరంజీవి భోళాశంకర్ కి పోటీగా వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తోందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు