Pawan’s Ustaad Bhagat singh: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ – ఆ సినిమా షూటింగ్ స్టార్ట్..!

Pawan’s Ustaad Bhagat singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో సినిమా చకచకా పూర్తయ్యి రిలీజ్ కూడా కాగా, ఓజి సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇదిలా ఉండగా, అప్పుడెప్పుడో మొదలైన హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ అటకెక్కిన పరిస్థితికి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఫస్ట్ పార్ట్ కి సరిపడా షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో మొదలైన మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో వినిపిస్తున్న వార్త పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు చేయమని కోరటంతో సినిమా యూనిట్ ఆ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. దీంతో డిలే అవుతుందని భావించిన ఈ సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యే సంకేతాలు వస్తున్నాయి.

- Advertisement -

వాస్తవానికి ఈ సినిమాకు ఇప్ప్పటిదాకా పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం కేటాయించినప్పటికీ హరీష్ మంచి క్వాలిటీతో గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేశాడు. తనకు ఇంకొన్ని డేట్స్ ఇస్తే అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేస్తానని హరీష్ పవర్ స్టార్ కోరగా పవన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి, ఇప్పటికే 50శాతం పైగా షూటింగ్ కంప్లైట్ అయిన ఓజి, ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పవన్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు