Rashi Singh: ఒక్క హిట్టు సినిమా లేదు. ఇప్పుడైనా వస్తుందా?

టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అవుతుంటారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. మరికొందరు వదిలేస్తారు. ఇంకొందరు సక్సెస్ కోసం కాకపోయినా, కనీసం మంచి గుర్తింపు కోసమైనా వెయిట్ చేస్తారు. అలాంటి వారిలో ఒకరు రాశి సింగ్. 2021లో పోస్టర్ అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కొన్ని చిన్న సినిమాల్లో, పలు ఓటిటి సినిమాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు సరైన విజయం గాని, గుర్తింపు గాని దక్కలేదు. చూడ్డానికి ఎంతో చక్కగా, మంచి గ్లామర్ గా కూడా ఉండే ఈ అమ్మాయికి తెలుగులో సినిమా ఛాన్సులు వస్తున్నాయి గాని హిట్లు లేవు.

గత ఏడాది రీసౌండ్, జెమ్, ఇంకా ఆహ ఓటిటి లో పలు సినిమాల ద్వారా పలకరించింది. కానీ ఇందులో ఈమె నటించిన ఒక్క సినిమా కూడా వచ్చినట్టు ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇప్పుడు ఫైనల్ గా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న “ప్రేమ్ కుమార్” అనే సినిమాలో హిరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. రాశి నటిస్తున్న సినిమాల్లో కొంచెం బజ్ ఉన్న సినిమా ఇదే.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉంది రాశి సింగ్. ఇక ప్రేమ్ కుమార్ కథ సినిమాను ఆగష్టు18న థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ద్వారా ప్లాపుల్లో ఉన్న హీరోకి, అలాగే మంచి ఫేమ్ సంపాదించాలన్న హీరోయిన్ రాశి సింగ్ కి హిట్ వస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు