Shah rukh khan : జవాన్ విషయంలో అదే నిజమైంది

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా జవాన్. తమిళ్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్న విషయం అందరికి తెలిసిందే. కాగా జవాన్ సినిమాకు సంబంధించి గత కొద్దీ కాలంగా ఒక రూమర్ ప్రచారంలో ఉంది. ఆ రూమర్ లో ఎంత వరకు నిజముందే తెలీదు కానీ అది బాగా పాపులరైంది. దాంతో ఫ్యాన్స్ లో ఆ రూమర్ నిజం అయితే బాగుండు అంత కోరుకోగా, ఇటీవలనే ఆ రూమర్ పై జవాన్ సినిమాకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ క్లారిటీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే, గతకొద్ది కాలంలో వరుస ఫ్లాప్ సినిమాలతో సతమవుతున్న సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, ఇటీవలనే రిలీజైన పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. అయితే బాలీవుడ్ దర్శకులు తీసే మూసా ధోరణి సినిమాల వల్లే తన కెరీర్ ఫ్లాప్ లు బాట పట్టిందని గ్రహించిన షారుఖ్ ఖాన్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ లతో పని చేయడానికి ఆసక్తి చూపించారు, ఇక ఆ సమయంలోనే అట్లీ, తలపతి విజయ్ తో కలిసి చేసిన బిగిల్ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అవడంతో షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు అట్లీ.

ఇక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఒక రూమర్ బాగా పాపులర్ అయింది. అయితే అదేంటంటే జవాన్ సినిమాలో తలపతి విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని. కాగా ఈ విషయంపై ఇప్పటి వరకు మూవీ అఫీషియల్ గా ఏది కన్ఫామ్ చేయకపోవడంతో ఇది రూమర్ గానే మిగిలిపోయింది.

- Advertisement -

అయితే ఇటీవలనే రిలీజైన జవాన్ ట్రైలర్ లో మాత్రం ఒక షాట్ లో విజయ్ ఉన్నట్టు రెఫరెన్స్ కనిపించడంతో ఈ రూమర్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఈ దాగుడుమూతల ఆటలకు చెక్ పెడుతూ జవాన్ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ పని చేసిన ఫైట్ మాస్టర్ ఒకరు తలపతి విజయ్ సినిమాలో ఉన్నాడని కన్ఫామ్ చేసారు. అంతేకాదు షారుఖ్ ఖాన్, విజయ్ ఇద్దరు కలిసి ఒక ఫైట్ సీన్ లో కూడా నటించారని ఆయన తెలిపారు. ఈ రోల్ కు గాను ఆయన రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. షారుఖ్ ఖాన్ కు జోడిగా ఈ సినిమాలో నయన తార నటిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు