Dhanush: శేఖర్ కమ్ముల బిగ్ ప్లాన్… రంగంలోకి యువ సామ్రాట్‌?

టాలీవుడ్‌లో ఫీల్ గుడ్ సినిమాలు అంటే, ప్రస్తుత కాలంలో వెంటనే గుర్తు వచ్చే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆనంద్.. గోదావరి.. హ్యాపీడేస్ నుంచి మొదలు ఇటీవల వచ్చిన లవ్ స్టోరీ వరకు ఒక్కో సినిమాకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కమర్షియల్ హంగులకు దూరంగా ఉండే శేఖర్ కమ్ముల రియాలిటీని ప్రతిబింబించేలా సినిమాలను తెరకెక్కిస్తాడు. అందుకే ఈ డైరెక్టర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్ నుంచి లవ్ స్టోరీ సినిమా తర్వాత ధనుష్ తో ఒక ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశాడు.

దాదాపు రెండేళ్ల పాటు స్క్రీప్ట్ ను రెడీ చేశాడు. మొదట ధనుష్ హీరో అనుకుని స్టార్ట్ చేసిన స్క్రీప్ట్ తీరా.. చూస్తే అది మల్టీ స్టారర్ స్టోరీ అయిందట. ధనుష్ పాత్ర కాకుండా, వచ్చే పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని సమాచారం. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా కథను మార్చే పాత్ర అని తెలుస్తుంది. అందుకే శేఖర్ కమ్ముల స్క్రీప్ట్ రెడీ చేయడానికి రెండేళ్ల సమయం తీసుకున్నాడట.

అయితే అలాంటి పాత్రకు న్యాయం చేసే మరో హీరోను వెతికే పనిలో పడ్డ శేఖర్ కమ్ములకు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కథ చెప్పగానే నాగ్ ఫిదా అయిపోయడాని సమాచారం.

- Advertisement -

అలాగే ధనుష్ కు జోడీ కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదింపులు జరుగుతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే నాగ్ కు జోడీగా ఎవరు ఉంటారనే సస్పెన్స్ ఇంకా ఉంది. దీంతో పాటు సినిమాకు మ్యుజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయ్యాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు