Game changer : రామ్ చరణ్ పై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

కాకా పట్టడంలో బాలీవుడ్ సెలెబ్రెటీలను మించిన వాళ్లు లేరని మరోసారి రుజువైంది. గత కొద్దీ కాలంగా హిందీ సినిమాకు ఆశించినంత మార్కెట్ లేకపోవడంతో బాలీవుడ్ నటి, నటులంతా సౌత్ సినిమాలలో నటించడానికి మొగ్గు చూపుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సౌత్ సినిమాలలో నటించాలంటే వీళ్ళందరు ప్రస్తుతం ఒకే ఒక్కదారిని ఎంచుకున్నారు.

అదేంటంటే కాకా పట్టేదారి. కాకా పట్టడం అంటే తెలిసిందేగా పొగడ్తలతో ఆ ప్రముఖ హీరోలను, డైరెక్టర్లను ముంచేస్తే, అది చూసిన ఆయా ఫిలిం మేకర్స్ వీళ్లకు సినిమా అవకాశాలిస్తారని తెగ ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ లిస్ట్ లోకి లేటెస్ట్ గా జాన్వీ కపూర్ కూడా చేరింది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో కలిసి నటిస్తోన్న ఈ బ్యూటీ, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే తెలుగులో వరుస అవకాశాలను కొట్టేస్తుంది. ఇప్పటికే అఖిల్ అక్కినేని రాబోయే సినిమాతో పాటు పలు యంగ్ హీరోల సినిమాల స్క్రిప్ట్స్ వింటున్న ఈ భామ ఇక తెలుగులోనే స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యే ప్లాన్ వేసిందేమో ఏమో గాని ఈ ముసురు వర్షంకాలంలో ఆమె టాలీవుడ్ హీరోలపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. దేవర సినిమాకు ముందు ఎన్టీఆర్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన జాన్వీ కపూర్ లేటెస్ట్ గా రామ్ చరణ్ పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

- Advertisement -

ఇటీవలనే ఆమె హీరోయిన్ గా నటించిన బవల్ అనే హిందీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్, రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ” ఇంతవరకు నేను చూసిన వాళ్లలో రామ్ చరణ్ లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి చూడలేదని. ఆయన సినిమా చేయడానికి నేను ఎప్పుడు రెడీ గా ఉంటా ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్ లో వైరల్ అవుతుండగా. గతంలో విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈమె అలాగే మాట్లాడిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు