BRO : ప్రపంచంలో నా అంత లక్కీ పర్సన్ ఎవరు లేడు- థమన్

హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ఈ చిత్రం ఈ నెల 28 న రిలీజ్ అవబోతుండటంతో ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.

వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ప్రత్యేక అతిథిధులుగా హాజరైన ఈ ఈవెంట్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది. ఇక ఈవెంట్ లో మ్యూజిక్ థమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

త్రివిక్రమ్ రచన సహకారం అందించిన ఈ సినిమాను తమిళ్ యాక్టర్ సముద్రఖని తెరకెక్కించారు. తమిళ్ లో సూపర్ హిట్టైన వినోదాయ సీతాం రీమేక్ గా ఈ సినిమాని రూపొందించగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి పవన్ చేస్తున్న దాదాపు అన్నీ సినిమాలకు థమనే మ్యూజిక్ అందించడం విశేషం. ఇక ఈ విషయాన్నే ఆయన ప్రి రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన చెబుతూ ” ప్రపంచంలో నా అంత లక్కీ పర్సన్ ఎవరు ఉండరు పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఇప్పుడు బ్రో, ఈ సినిమా తరువాత OG సినిమాలకు మ్యూజిక్ చేయడం నా అదృష్టం అంటూ ఆయన చెప్పగా.. బ్రో సినిమాకు థమన్ అందించిన పాటలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోగా థమన్ ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. OG సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా థమన్ బ్రో సినిమాకు ఇచ్చినట్టే సాదాసీదా మ్యూజిక్ OG కి కూడా ఇస్తే, సినిమాపై తాము పెట్టుకున్న ఆశలన్నీ చెదిరిపోతాయని పీకే ఫ్యాన్స్ అంత ఆందోళన చెందుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు