Bollywood: ఆ పెళ్లైన హీరోతో డేటింగ్ చేశాను.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ లో కాంట్రవర్షియల్ క్వీన్ ఎవరంటే చటుక్కున వచ్చే సమాధానం కంగనా రనౌత్. కంగనా ఏ విషయం అయినా సూటిగా మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. ఈమె బహిరంగంగా చేసే వ్యాఖ్యలే కాకుండా సోషల్ మీడియాలో కూడా చేసే వ్యాఖ్యలు అప్పుడప్పుడు చర్చనియాంశం అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అనవసరం లేని గొడవలు కొనితెచ్చుకుంటూ ఉంటుంది. అందుకే ఆమెను అభిమానులు ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు.

అయితే నటిగా మాత్రం ఈమె విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా పలు షాపింగ్ విషయాలను బయటపెట్టింది. “బాలీవుడ్ ఇండస్ట్రీలో 99% మందికి డ్రగ్స్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఇలా చెప్పడానికి ఎవ్వరు ధైర్యం చేయరు. కానీ నాకు భయం లేదు. ఓ స్టార్ హీరో కూడా విపరీతంగా డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. దీంతో ఆయన భార్య అతడిని వదిలేసింది. ఆ తర్వాత కొంతకాలానికి నేను ఆ స్టార్ హీరో తో డేటింగ్ చేశాను.

ఆ సమయంలో అతడు అతిగా డ్రగ్స్ తీసుకోవడం నేను చూశాను. కొన్నాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ నన్ను బెదిరించడంతో నేను అతడికి దూరం కావాల్సి వచ్చింది” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే గతంలో కంగనా హృతిక్ రోషన్ తో డేటింగ్ చేసిందనే వార్తలు వినిపించడంతో బహుశా అతడేనేమోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇక కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి కంగనా స్వీయ దర్శకత్వంలో నటిస్తోంది. అలాగే చంద్రముఖి 2 మూవీలో కూడా కంగనా నటిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు