Guntur Karam Movie Latest Update : గుంటూరు కారం విషయంలో అనుకున్నదే అయ్యింది

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు కారం సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.గత కొద్దీ రోజులుగా సినిమాపై వస్తోన్న రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టె విధంగా గుంటూరు కారం నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు చివరికి నిరాశే మిగిలింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న గుంటూరు కారం సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యంత వివాదస్పదమవుతున్న సినిమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. హీరోయిన్ పూజా హెగ్డే విషయం నుంచి స్టార్ట్ అయిన గుంటూరు కారం సినిమా వివాదాల పర్వం నేటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక దీనికి తోడు సినిమా అప్డేట్ ల విషయంలో కూడా ప్రొడక్షన్ హౌస్ ఏమాత్రం బాధ్యత వహించటం లేదని స్పష్టమవుతోంది.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు కారం సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దాంతో వాటినన్నింటిని నమ్మిన మహేష్ బాబు అభిమానులు నిజంగానే సినిమాలోని మొదటి పాట రిలీజ్ చేస్తారని ఆశగా ఎదురు చూసారు. ఇక రాత్రి 12 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అప్డేట్ ఇస్తామని మూవీ టీం కూడా ప్రకటించింది. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సాంగ్ అప్డేట్ ఇస్తారని వెయిట్ చేసారు. కానీ తీరా చూస్తే మహేష్ బాబు పోస్టర్ మాత్రం రిలీజ్ చేసి, మహేష్ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. దింతో మహేష్ అభిమానులు ఈమాత్రం దానికి అర్థరాత్రి అప్డేట్ అంటూ ఎందుకు ఓవర్ యాక్షన్ చేయడం అంటూ మూవీ బ్యానర్ పై మండిపడుతున్నారు.

- Advertisement -

అయితే ఒక్క విషయంలో గుంటూరు కారం మూవీ టీం చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారం ఆగిపోయింది ఇక రిలీజ్ అవ్వదని మీడియాలో ఎన్ని రకాలుగా కథనాలు వస్తున్న కూడా  మూవీ టీం  రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో ఖచ్చితంగా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తెలియపరుస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే అని తెలుస్తుంది. ఇక ఈ పుట్టినరోజుకు మహేష్ బాబు ఫ్యాన్స్ బిజినెస్ మ్యాన్ రీ-రిలీజ్ తో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు