Mahesh’s Guntur Kaaram: గుంటూరు కారం షూటింగ్ ఎప్పుడంటే..?

Mahesh’s Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద ట్రాజడీగా మారింది గుంటూరు కారం సినిమా. ఏ ముహూర్తాన మొదలైందో కానీ, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన క్షణం నుండి ఒక అడుగు ముందుకు వేస్తే, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయింది. షూటింగ్ వాయిదా పడటం ఒక పక్క, హీరోయిన్ పూజా హెగ్డేను తప్పించటం, స్టంట్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ లను కూడా మార్చటం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవటంతో మహేష్ ఫ్యాన్స్ లో ఆందోళన పెంచుతోంది. గుంటూరు కారం సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాల వల్ల అసలు ఈ సినిమా పూర్తవుతుందా లేక అటకెక్కుతుందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ కి ఉపశమనం కలిగించే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుండి స్టార్ట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. వెకేషన్లో మహేష్ బాబు 16న ఇండియాకి రానున్న నేపథ్యంలో ఆ లోపు సినిమాటోగ్రాఫర్ ని కూడా ఫైనలైజ్ చేయనున్నారని అంటున్నారు.  అంతే కాకుండా, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని, ఈ సినిమా పాటలకు సంబంధించి త్రివిక్రమ్ ఈ రోజు థమన్ తో డిస్కషన్ జరిగిందని సమాచారం అందుతోందని ఇటీవలే క్లారిటీ వచ్చింది.

మొదట యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసిన గురూజీ, ఇప్పుడు సాంగ్స్ షూట్ చేయాలని డిసైడ్ అయ్యాడట.మొత్తానికి సినిమా ఉంటుందా అటకెక్కుతుందా అన్న సంశయంలో ఉన్న మహేష్ అభిమానులకు ఈ వార్త పెద్ద రిలీఫ్ ని ఇచ్చింది. మరి, మొదట 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి సమ్మర్ కి అయినా రిలీజ్ అవుతుందేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు