NTR: దేవరా లేటెస్ట్ అప్డేట్.. అస్సలాగట్లేదుగా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో భారీ పాన్ ఇండియా సినిమా “దేవర” చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఎక్కడా విరామం లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోగా, ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా కొరటాల మార్క్ లో సాఫ్ట్&స్టైలిష్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో సంయుక్తంగా తెరకెక్కుతుండగా, నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ప్రత్యేకంగా దగ్గరుండి చూసుకుంటున్నాడు. RRR సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీ అంచనాలున్నాయి. అటు కొరటాల కూడా ఆచార్య డిజాస్టర్ తో ఈ సినిమా తో భారీ కంబ్యాక్ ఇవ్వాలని కసితో పని చేస్తున్నాడు.

ఇక దేవర షెడ్యూల్ శంషాబాద్ లో జరుగుతుండగా అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 20తో పూర్తి అయిపోతుంది. ఇక ఈ సినిమా కి సంబంధించి టాకీ పార్ట్ నవంబర్ ఎండింగ్ కల్లా పూర్తవుతుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. ఆ తరువాత కొన్ని టెక్నికల్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉంటాయని అంటున్నారు. ఇక దేవర ప్రమోషన్లకే చిత్ర యూనిట్ మూడు నెలల పాటు కేటాయించనున్నట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక దేవర సినిమా 2024 సమ్మర్ లో ఏప్రిల్ 5న విడుదల అవుతుందని ఇంతకు ముందే మేకర్స్ ప్రకటించడం జరిగింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు