RAPO : పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ యంగ్ హీరో వధువు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల పెళ్లిళ్లతో సందడి, సందడిగా ఉంది. ఇప్పటికే శర్వానంద్ పెళ్లి, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థంతో కళ కళ లాడుతుండగా లేటెస్ట్ మరో హీరో యంగ్ హీరో పెళ్లి వార్తతో సినీ పరిశ్రమలో సందడి నెలకొంది.

గతకొద్ది రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి వార్త సోషల్ మీడియాలో చాలా రోజులుగా వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ వార్తపై వరుణ్ గాని, లావణ్య త్రిపాఠి గాని ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేదని అంత అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తారుమారు చేసేలా జూన్9న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. దాంతో నిప్పు లేకుండా పోగ రాదు అనే సామెత నిజమైంది. అంటే వార్తలో నిజం లేకుండా అది వైరల్ అవ్వదని ప్రూవ్ అయిందన్నమాట.

లేటెస్ట్ గా ఇలాంటిదో మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా.. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని పెళ్లి వార్త. చాక్లెట్ బాయ్ గా ఉండే రామ్ కాస్త ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఉస్తాద్ రామ్ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఈ ఉస్తాద్ రామ్ కాస్త పెళ్లి కొడుకు రామ్ గా మారబోతున్నడనే వార్త టాలీవుడ్ లో గట్టిగ వినిపిస్తోంది. మరీ రామ్ పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఏ హీరోయినో అనుకుంటే పొరపాటే. రామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సినిమాలతో ఎటువంటి సంబంధం లేదంట. హైదరాబాద్ లో సెటిల్ అయిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూతురిని రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడట. అయితే ఈ పెళ్లి కూడా కంప్లీట్ గా అరేంజ్డ్ మ్యారేజ్ అని సమాచారం. ఇక రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు