Sunny Deol New Movie: గదర్2 బుకింగ్స్ చూసి బాలీవుడ్ మైండ్ బ్లాక్?

Sunny Deol New Movie

బాలీవుడ్ లో ఈ వారం రెండు క్రేజీ సీక్వెల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండు సినిమాల్లోను ఇద్దరు బడా స్టార్లు నటించగా, రెండింటికీ ట్రేడ్ వర్గాల అంచనాలకి రివర్స్ లో క్రేజ్ ఏర్పడింది. అందులో ఒకటి OMG2. అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో కూడా అక్షయ్ హీరోగా నటించగా ఆగష్టు 11న రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక అదే రోజు రిలీజ్ అవుతున్న మరో భారీ సినిమా గదర్2. 22 ఏళ్ళ కిందట గదర్ ఏక్ ప్రేమ్ కథ సినిమాకి సీక్వెల్ గా గదర్2 తెరకెక్కింది. మొదటి పార్ట్ లో నటించిన సన్నీ డియోల్ ఈ సినిమాలోనూ హీరోగా నటించాడు. ఇక గదర్ సినిమా ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత సన్నీ డియోల్ కి మళ్ళీ సరైన సక్సెస్ ఇప్పటివరకు రాలేదు. దాంతో ఈ హీరో ఏకంగా ఫేడ్ అవుట్ అయిపోయే స్టేజ్ కి వచ్చాడు. కానీ ఈ సినిమా సీక్వెల్ సన్నీ డియోల్ ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఎందుకంటే గదర్2 కి అవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ OMG2 కన్నా ఈ సినిమాకే ఎక్కువ బుకింగ్స్ అవుతుండడం విశేషం. అయితే హీరోలకు ఉన్న ఫామ్, క్రేజ్ దృష్ట్యా ట్రేడ్ వర్గాలు అక్షయ్ సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు.

- Advertisement -

కానీ అవుతున్న అడ్వాన్సు బుకింగ్స్ లెక్కలు చూస్తే గదర్2 కి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రిలీజ్ రోజు అక్షయ్ కుమార్ omg2 కి 10కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండగా, గదర్2 సినిమాకి ఆల్మోస్ట్ డబుల్ అంటే 20 నుండి 25 కోట్ల వరకు ఓపెనింగ్స్ రావొచ్చని అంటున్నారు. మరి రిలీజ్ రోజు ఏ సీక్వెల్ సినిమాకి బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

Previous article
Next article

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు