SuryaSonOfKrishnan: డబ్బింగ్ సినిమాల్లో రికార్డు!

Srurya son of krishnan movie

టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. హీరోల బర్త్ డే లకు స్టార్ట్ అయిన ఈ రీ రిలీజ్ సినిమాల ట్రెండ్, ఇప్పుడు పలు సినిమాల వార్షికోత్సవాలకు, పండగలకు ఎలాంటి సందర్భాల్లోనైనా రిలీజ్ అవుతున్నాయి. గతంలో ఆయా స్టార్ హీరోల ప్లాప్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏకంగా డబ్బింగ్ సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొడుతూ అందరికి షాక్ ఇస్తున్నాయి.

అయితే కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన “సూర్య సన్ అఫ్ కృష్ణన్” 2008 లో విడుదలై సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హ్యారిస్ జైరాజ్ అందించిన సంగీతం బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఇక తాజాగా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ తెలుగులో రీ రిలీజ్ అయింది. ముందుగా చిన్నగా 250 షోలతో రిలీజ్ అయిన ఈ సినిమా హౌసఫుల్ బుకింగ్స్ తో ఎక్స్ట్రా షోస్ వేసేలా చేసింది.

దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 550 కి పైగా హౌస్ ఫుల్ షోస్ పడడం విశేషం. ఇక రీ రిలీజ్ లో ఈ సినిమా తెలుగు సినిమాలకి పోటీగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. నైజాం లో 50లక్షలు, ఆంధ్ర లో 90 లక్షలు రాగా, బెంగుళూరు షోస్ తో కలిపి మరో 5లక్షల దాకా కలెక్షన్స్ రాబట్టింది. ఓవరాల్ గా ఫస్ట్ డే 1.45 కోట్ల దాకా వసూలు చేయడం విశేషం. ఇక రెండో రోజు కూడా దాదాపు 80 లక్షల దాకా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే ఒక డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ కి కూడా ఇంత భారీ కలెక్షన్లు రావడం పట్ల హీరో సూర్య సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు