August Movies: ఈ మూడు సినిమాలు ఆగష్టు నుండి ఔట్!

August competition

టాలీవుడ్ లో ఆగష్టు నెలలో చాలా ప్రతిష్టాత్మక సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక జులై చివర్లో పవన్ కళ్యాణ్ “బ్రో” సినిమాతో పలకరించగా ఆ సినిమా వలన ఆగష్టు ఫస్ట్ వీక్ లో పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. అన్ని చిన్న సినిమాలే వచ్చాయి. అయితే ఆగష్టు రెండో వారంలో మాత్రం జైలర్, భోళా శంకర్ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి వల్ల మూడో వారంలో వచ్చే పలు సినిమాలు వాయిదా పడగా, నాలుగో వారంలో బెదురు లంక, గాండీవధారి అర్జున రిలీజ్ అవుతున్నాయి.

ఈ సినిమాల పోటీవలన కొన్ని సినిమాలు అఫిషియల్ గా ఆగష్టు రిలీజ్ నుండి తప్పుకున్నాయి. అందులో మొదటగా చెప్పాల్సింది నవీన్ పోలిశెట్టి, అనుష్క హీరో,హీరోయిన్లు గా వస్తున్న చిత్రం “మిస్ శెట్టి,మిస్టర్ పోలిశెట్టి”. ఈ ఆగష్టు 18 రిలీజ్ కావాల్సి ఉండగా ముందు వారం రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల కారణంగా పోస్టుపోన్డ్ అయ్యింది. కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు.

ఇక రెండోది “పెదకాపు”. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి క్రేజీ బజ్ ఉంది. టీజర్ అంచనాలని రెట్టింపు చేయగా, భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా పోటీలో ఉంచడం రిస్క్ అని భావించి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్ ఇంకా మిగిలి ఉందని అంటున్నారు.

- Advertisement -

ఇక చివరగా ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆదికేశవ్ మూవీ ఆగష్టు18 నే రిలీజ్ కావాల్సింది. అయితే దీనికి వారం ముందు తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్, అలాగే వారం తర్వాత 25న తన బావ వరుణ్ తేజ్ గాండీవ ధారి అర్జున రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ కొత్త రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇక అఫిషియల్ గా ఈ మూడు చిత్రాలు ఆగష్టు రేస్ నుండి తప్పుకున్నట్టే అని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు