BIG breaking dsp marriage news : సింగర్ మంగ్లీ సిస్టర్ ఇంద్రావతితో దేవిశ్రీప్రసాద్ పెళ్లి..?

BIG breaking devi sri prasad marriage news

తన పాటలతో, సంగీతంతో నాలుగు పదుల వయసు దాటినా కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పిన దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడతారు. మ్యూజిక్ అందించడమే కాకుండా చాలా సినిమాలకు పాటలు కూడా అద్భుతంగా అందించారు. అయితే ఈయన ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం అంత ఆశాజనకంగా లేదని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే నాలుగు పదాల వయసు దాటినా కూడా డిఎస్పి ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. గతంలో దేవిశ్రీ ఎంతో గాఢంగా ప్రేమించిన ఛార్మి అతడిని మోసం చేసి వెళ్ళిపోయిందని, అప్పటినుండి ప్రేమ, పెళ్లిపై అతనికి నమ్మకం పోయిందని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈయన సింగర్ మంగ్లీ (సత్యవతి) చెల్లెలు ఇంద్రావతిని పెళ్లి చేసుకోబోతున్నారట. ఈమె దేవిశ్రీ సంగీతం అందించిన పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావా ఉ ఉ అంటావా’ అనే పాట పడి ఒక్కసారిగా ఇండియా మొత్తం ఫేమస్ అయ్యింది.

అయితే తాజాగా ఇంద్రావతి తన సోషల్ మీడియాలో దేవిశ్రీ తో క్లోజ్ గా దిగిన రెండు ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ జంట చూడముచ్చటగా ఉందని.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో దేవిశ్రీప్రసాద్ – ఇంద్రావతి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే న్యూస్ వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు