Puri Connects : హ్యాపీ బర్త్ డే ఛార్మి

నీ తోడు కావాలి సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయమైన ఛార్మి మొదటి సినిమా ప్లాప్ అయిన కూడా తన అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా హిట్ అయితే గాని పట్టించుకోని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలలో ఛార్మి మొదటి హిట్ చూడటానికి చాలా సమయమే పట్టింది.

కృష్ణ వంశి దర్శకత్వంలో, నితిన్ హీరోగా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మి తన అందాలని ఆరబోసి ఎక్స్ పోసింగ్ కూడా చేయడానికి తాను రెడీ అంటూ ఇండస్ట్రీ పెద్దలకి హింట్ ఇచ్చింది. దాంతో ఛార్మికి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తరువాత నుంచి ఛార్మి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోయింది. అలా నాగార్జున సరసన మాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసి తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. అయితే ఆ తరువాత నుంచి ఛార్మి కి వచ్చిన సినిమాలన్నీ సెకండ్ హీరోయిన్ గానే రావడంతో ఆమె మంత్ర అనే హర్రర్ సినిమాతో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ ధోరణి కొన్నాళ్లపాటు సాగింది. దాంతో ఛార్మికి గ్లామర్ రోల్స్ రావడం తగ్గాయి. ఆ తరువాత ఆమె సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ, చేతికందిన సినిమాలలో క్యారెక్టర్ చేస్తూ ఉండగా జ్యోతి లక్ష్మి సినిమాతో ఆమె ప్రొడ్యూసర్ గా మారింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించి రిలీజ్ కి ముందు మంచి బిజినెస్ చేసింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాతో పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడిన ఛార్మి ఆయనతో కలిసి ఆయన సినిమాలకి కో ప్రొడ్యూసింగ్ చేయడం స్టార్ట్ చేసింది. మొదటి రెండు, మూడు సినిమాలు విజయం సాధించకపోయినా .. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ ఇద్దరు సక్సెస్ సాధించారు. ఇస్మార్ట్ ఇచ్చిన జోష్ తో వెంటనే విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాని నిర్మించారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మళ్ళీ మొదటికి వచ్చారు. ప్రస్తుతం పూరి, ఛార్మి ఇద్దరు కలిసి వాళ్ళకి సక్సెస్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ తీసుకుతున్నారు. వచ్చే ఏడాది మార్చ్ 8న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు ప్రకటించారు. మరీ ఈ సినిమాతోనైన ఛార్మి సక్సెస్ అందుకోవాలని కోరుకుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు