Thalapathy68: ప్లాప్ డైరెక్టర్ కి అవకాశమిస్తున్న తలపతి విజయ్

తమిళ్ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న లియో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంటుంది. అక్టోబర్19న సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే లియో తర్వాత విజయ్ ఏ డైరెక్టర్ కి అవకాశమివ్వబోతున్నరనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సిఉంది. గతంలో విజయ్, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే వార్త బాగా ట్రెండ్ అయిన ఈ సినిమాపై ఇంకా అఫీషియల్ న్యూస్ ఏది రాలేదు. అలాగే వారసుడు సినిమాతో విజయ్ కి హిట్ ఇచ్చిన వంశి పైడిపల్లితో కూడా ఆయన సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఈ న్యూస్ కూడా రూమర్ గానే మిలిగిపోయింది. ప్రస్తుతం మరో తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ పేరు తెరపైకి వస్తుంది.

ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు వెంకట్ ప్రభు. నాగ చైతన్య హీరోగా ఇటీవలనే కస్టడీ సినిమా చేసిన వెంకట్ ప్రభు, తన నెక్స్ట్ సినిమా విజయ్ చేయబోతున్నారనే వార్త గట్టిగ వినిపిస్తుంది. అయితే మంచి అంచనాల మధ్య రిలీజైన కస్టడీ సినిమాకి మిక్సెడ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే. కొంత మందికి సినిమా నచ్చింది అంటుంటే, ఇంకొందరు మొహమాటం లేకుండా డిజాస్టర్ అని తేల్చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా సినిమా రిపోర్ట్ ఇలాగే ఉంది. చేతిలో బ్లాక్ బస్టర్ సినిమా ఉంటె తప్ప విజయ్ లాంటి స్టార్ యాక్టర్ సినిమా ఒప్పుకోడు కానీ కస్టడీ లాంటి యావరేజ్ సినిమా తీసిన కూడా వెంకట్ ప్రభుతో సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకున్నాడట . ప్రముఖ నిర్మాణ సంస్థ ఎజియస్ ఈ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయబోతుందంట. తొందరలోనే ఈ న్యూస్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు