RRR :ఎన్టీఆర్30 టైటిల్ ఇదే ! ఆల్మోస్ట్ కన్ఫామ్ భయ్యా

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే మూడో షెడ్యూల్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది .

అయితే RRR సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే RRR సినిమాలో ఎన్టీఆర్ రోల్ నిడివి తక్కువగా ఉందని అభిప్రాయపడిన ఫ్యాన్స్ కొరటాల శివ సినిమాపైన తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ ఎన్టీఆర్30 సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. కోస్టల్ బ్యాగ్డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతుంది.

అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు వస్తుండటంతో ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కి ఉన్న వరల్డ్ వైడ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని RRR తరహాలో ఉండేలా వన్ వర్డ్ టైటిల్ ని పెడదామనుకున్నరట. కానీ ఇప్పుడు కథ పరంగా ఆలోచించి సినిమాకి “దేవర ” అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో ఉన్నారంట. దేవర అనే పదనికి అర్థం దేవుడు అని వస్తుండటంతో ఈ టైటిల్ నే ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే దేవర అనే టైటిల్ ఫ్యాన్స్ కి కూడా నచ్చడంతో అప్పుడే ఫ్యాన్ మెడ్ ఎడిట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ఒక తమిళ స్టార్ హీరో కూడా ఈ సినిమాలో కొద్దీ నిమిషాలపాటు కనిపిస్తారనే వార్త వినిపిస్తోంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు