Liger :టాలీవుడ్‌లో సినిమాలు ఫ్లాప్ అయితే డైరెక్టర్లదే తప్పా..?

ఒక సినిమా తెరకెక్కించడంలో దర్శకుడి పాత్ర చాలా కీలకం. కథ, కథనం, డైలాగ్స్, సాంగ్స్ ప్లేస్ మెంట్స్, నటీనటుల యాక్టింగ్ నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోవడం ఇలా అన్నీ సరిగ్గా కుదిరితేనే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. అందుకే సినిమాకు డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అందుకే సినిమాలు సక్సెస్ అయితే, రాజమౌళి లా సూపర్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటారు. అదే ఫ్లాప్ అయితే మాత్రం ఇండస్ట్రీలో మరోసారి కనిపించకుండ కనుమరుగు అయిపోతారు.

తాజాగా అలాంటి పరిస్థితే డైరెక్టర్ సురేందర్ రెడ్డికి వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవల ఏజెంట్ అనే చిత్రం వచ్చిన సంగతి విధితమే. దాదాపు రెండేళ్ల పాటు కష్టపడి తెరకెక్కించిన ఏజెంట్ చిత్రం కనీసం రెండు వారాలు కూడా థియేటర్ లలో ఆడలేదు. అంతే కాదు.. ఫస్ట్ డే రెండు షోలు కూడా హౌస్ ఫుల్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ చిత్రాల జాబితాలో ఏజెంట్ చేరిపోయింది. దీనికి డైరెక్టర్ సురేందర్ రెడ్డినే పూర్తి బాధ్యుడిని చేస్తున్నారు. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ చేశాడని నిర్మాత అనిల్ సుంకర ప్రకటించాడు.

తాజాగా అఖిల్ తన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ రాసిని లెటర్ లో కాస్ట్ అండ్ క్రూ మొత్తం పేర్లు ప్రస్తావించాడు. కానీ, సురేందర్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. దీంతో ఈ డైరెక్టర్ పై అక్కినేని హీరో చాలా కోపంతో ఉన్నాడని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా ఏజెంట్ వల్ల సురేందర్ రెడ్డికి భారీగానే నష్టం జరిగింది. సురేందర్ రెడ్డికి ఇప్పటి వరకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు, తమ అడ్వాన్స్ ను తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారట. అంతే కాదు.. సురేందర్ తో సినిమా చేయాలంటే అటు నిర్మాతలు, ఇటు హీరోలు ఆలోచిస్తున్నారట.

- Advertisement -

ఏజెంట్ సినిమాకు మాత్రమే కాదు.. గతంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య ఫ్లాపునకు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ డిజాస్టర్ కు కారణం డైరెక్టర్లే అని బయటకు చెప్పారు. ఆచార్య ఫ్లాపు నుంచి బయటకు రావడానికి డైరెక్టర్ కొరటాలకు దాదాపు సంవత్సరం టైం పట్టింది. ఇక లైగర్ డిజాస్టర్ నుంచి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. లైగర్ తర్వాత పూర్తి అనుకున్న చాలా ప్రాజెక్ట్ లు పెండింగ్ లో పడ్డాయి. మరి కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఇలా సినిమాలు ఫెయిల్ అయితే డైరెక్టర్లు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. అందులో చేసిన హీరోలకు మాత్రం వెను వెంటనే అవకాశాలు వస్తున్నాయి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు