Tollywood: ఈ వారం కూడా చిన్న సినిమాల సందడే!

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా చిన్న సినిమాలే వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఆదిపురుష్ తర్వాత పెద్ద సినిమాలేవీ రాకపోగా, మీడియం రేంజ్ సినిమాల్లో కూడా “స్పై” మినహా మరో చిత్రం రాలేదు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయన్న సంగతి తెలిసిందే. గతవారం మూడు చిన్న సినిమాలు రిలీజ్ అయితే అందులో బేబీ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే అది కంటెంట్ పరంగా మాత్రం బీలో యావరేజ్ సినిమా.

ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాలేవీ లేవుగాని నాలుగు చిన్న సినిమాలు మాత్రం మంచి అంచనాలతో రిలీజ్ అవుతున్నాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా, మరో రెండు స్ట్రెయిట్ చిత్రాలు. ఇక ముందుగా అశ్విన్ బాబు హీరోగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిడింబ అనే సినిమా జులై 20న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను ముందుగా ఎవరు పట్టించుకోలేదు గాని, ట్రైలర్ చూసిన తర్వాత మంచి బజ్ ఏర్పడింది. టాక్ కనుక బాగుంటే ఖచ్చితంగా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక జూలై 21న 90స్ కామెడీ మూవీగా అన్నపూర్ణ ఫోటో స్టూడియో రిలీజ్ అవుతుంది. యూట్యూబ్ స్టార్ చైతన్య రావు హీరోగా నటించిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కామెడీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా కొంచెం నచ్చేసిన చాలు హిట్ సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఇక ఇదేగాక విజయ్ ఆంటోని నటించిన డబ్బింగ్ సినిమా హత్య కూడా 21నే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన మూవీ కాగా ఇందులో ఒక డిటెక్టివ్ గా నటించాడు విజయ్.

- Advertisement -

ఇక ఇవే గాక రుహాణి శర్మ హీరోయిన్ గా నటించిన హర్, కామెడీ మూవీ జిలేబి కూడా ఈ వారమే రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు ఆడియన్స్ ని మెప్పిస్తాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు