Vijay Antony: మరింత ఇంట్రెస్టింగ్ గా “హత్య” ఫైనల్ ట్రైలర్?

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బిచ్చగాడు2 తో మంచి కమ్ బ్యాక్ హిట్ కొట్టిన విజయ్ దాదాపు అరడజను సినిమాలు లైన్లో పెట్టాడు. ఇక తాను లేటెస్ట్ గా మరో క్రైమ్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. తమిళ్ లో “కొలై” పేరుతో తెరకెక్కిన ఈ ఆ సినిమా తెలుగులో “హత్య” పేరుతో డబ్ అవుతుంది.

తాజాగా ఈ సినిమా యొక్క ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం వస్తుంది. బాలాజీ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో మిడిల్ఏజ్ వ్యక్తి గా కనిపిస్తున్నాడు. రితికా సింగ్ ఈ సినిమాలో క్రైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా, మీనాక్షి చౌదరి ప్రముఖ ఆర్టిస్ట్ గా నటించింది. లైలా అనే నటి హత్య కేసుపై ఈ కథ మొత్తం నడుస్తుంది. ట్రైలర్ కూడా మొత్తం సీరియస్ గా ఉంది, కాబట్టి ఈ సినిమాలో కామెడీకి ఏమాత్రం స్కోప్ లేదని అర్ధం అవుతుంది.

- Advertisement -

ఇక ఇంతకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ కన్నా, ఇప్పుడు రిలీజ్ అయిన ఫైనల్ ట్రైలర్ మరింత ఆసక్తిని కనబరుస్తుంది. సినిమా ఎక్కువగా నైట్ లొకేషన్లల్లోనే చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. ఇక లోటస్ పిక్చర్స్ మరియు ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా జులై 21న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడూ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరించే విజయ్ ఆంటోని ఇప్పుడు వస్తున్న హత్య చిత్రం ద్వారా ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు