Bhola shankar : బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న కీర్తి సురేష్

ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలో ఏ క్యారెక్టర్ అయిన అవలీలగా చేయగలిగే హీరోయిన్స్ పేరు వరుసగా చెప్పాల్సి వస్తే కీర్తి సురేష్ పేరే మొదటగా చెప్పాలి. ఎక్స్ పెరిమెంట్ సినిమానైనా, ఎమోషనల్ సీన్ అయిన, గ్లామర్ రోల్ అయిన, డి -గ్లామర్ పాత్రైనా, క్యారెక్టర్ ఏదైన సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ఆమె నటనతో అందరిని మెప్పిస్తుంది కీర్తి సురేష్.

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో గత కొద్దీ కాలంగా అగ్ర నటిగా కొనసాగుతున్న కీర్తిసురేష్, తొందర్లోనే బాలీవుడ్ లోను అడుగు పెట్టనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి కీర్తి సురేష్ కు గత కొద్దీ కాలంగా బాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వస్తూనే ఉన్న కూడా ఆమె సౌత్ సినిమాలలో బిజీగా ఉండటం మూలాన ఆ అవకాశాలను తోసి పుచ్చుతూ వచ్చింది.

అయితే ప్రస్తుతం ఆమె చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు షూటింగ్ లు చివరి దశకు చెరుకోవడంతో ఆమె ఇక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది. తమిళ్ లో తలపతి విజయ్ హీరోగా వచ్చి, సూపర్ హిట్టైన తేరి సినిమాను ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం అందుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి తొందర్లోనే మిగితా విషయాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో భోళా శంకర్ సినిమాలో మరియు తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు