Pawan kalyan: బ్రో సినిమా గురించి ప్రియా ప్రకాష్ వారియర్ ఏమందంటే ?

కేవలం కన్నుగీటి కుర్రకారును ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికి తెలిసిందే. సోషల్ మీడియా అప్పుడప్పుడే జనాలకు అలవాటు అవుతున్న సమయంలో కేవలం 30 సెకన్లు కన్ను గిటీన వీడియో క్లిప్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపొయింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న బ్రో సినిమాలో నటిస్తుంది. ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ అవబోతున్న బ్రో సినిమా గురించి ప్రియా తన అనుభవాలను బయట పెట్టింది.

ఓరు ఆదార్ లవ్(లవర్స్ డే) సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ కు సోషల్ మీడియా పుణ్యమా అని అతి తక్కువ సమయంలోనే తెగ పాపులర్ అయింది.

- Advertisement -

అయితే ఈ సినిమా చేసే నాటికీ ప్రియా వయస్సు కేవలం 22 ఏళ్ళు మాత్రమే అవడంతో, తెలిసి తెలియని వయస్సు లో ఈ బ్యూటీకి వచ్చిన పాపులారిటీ ఈమె కెరీర్ ను చిక్కుల్లో పడేసింది. ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియా లేటెస్ట్ గా పవన్ పక్కన నటించే అవకాశం అందుకుంది. కాగా ఈ విషయం పై ఆమె స్పందిస్తూ

“కెరీర్‌ ప్రారంభంలోనే పవన్‌కల్యాణ్‌ లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ఆయనకు, నాకు కాంబినేషన్‌లో సన్నివేశాలున్నాయి. ఆయన తన యాక్టింగ్ తో మ్యాజిక్‌ చేస్తారు. గత చిత్రాలతో పోలిస్తే నేను ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు వీణ.

తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. హోమ్లీ గర్ల్‌ లాంటి పాత్ర వినోదయ సీతాం తో పోలిస్తే ‘బ్రో’ సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్‌కల్యాణ్‌ గారి ఇమేజ్‌కు తగ్గట్టుగా, సినిమాలో సోల్‌ మిస్‌ అవ్వకుండా చేంజెస్ చేశారు. చాలా కొత్త సీన్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరికి నచ్చుతుంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు