AK Entertainments: సేఫ్ గేమ్ ఆడుతున్న భోళా మేకర్స్?

Bhola Shankar Producers in Safe Zone

టాలీవుడ్ లో ఈ ఇయర్ వచ్చిన పెద్ద సినిమాల్లో ఆడియన్స్ ని అలరించిన సినిమాలు పెద్దగా రాలేదని చెప్పాలి. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య ఒక్కటే బ్లాక్ బస్టర్ గా నిలిచి బయ్యర్లకి లాభాలు వచ్చేలా చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ డిజాస్టర్ కాగా, గత వారం రిలీజ్ అయిన “బ్రో” కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. బ్రో కాన్సెప్ట్ బాగున్నా, కొన్ని కారణాల వల్ల ఆడియన్స్ ని మెప్పించలేదు. ఇక ఇప్పుడు రిలీజ్ అవుతున్న మరో పెద్ద సినిమా “భోళా శంకర్”.

“బ్రో” సినిమాలాగే ఈ సినిమాపై కూడా అభిమానుల్లోనే పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఒక మామూలు కమర్షియల్ సినిమాకి రీమేక్ గా వస్తున్నందున, అందులోను ట్రైలర్స్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో భోళా శంకర్ పై ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది. అందుకే రిస్క్ లేకుండా ఈ సినిమా నిర్మాతలు కూడా సేఫ్ జోన్ లో తక్కువ రేట్లకే సినిమాని అమ్మాలని డిసైడ్ చేసుకున్నారని టాక్ నడుస్తుంది.

ముందుగా 100కోట్ల రేంజ్ లో బిజినెస్ ని ప్లాన్ చేయగా, ఇప్పుడు అందులో కొన్ని ఏరియాలలో తక్కువ రేట్లకి కుదించి ఓవరాల్ గా 80 కోట్ల బిజినెస్ రేంజ్ లోనే క్లోజ్ చేయాలనీ చూస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా నైజాం లో భోళా శంకర్ కి 30 కోట్ల రేటు పలకగా, ఇప్పుడు 22 కోట్లకు అమ్మడం జరిగిందట. ఇక సీడెడ్ లో 15కోట్లు జరగ్గా, దాన్ని 12 కోట్లకి సెట్ చేశారట. ఇలా చాలా చోట్ల బయ్యర్లకి అనుకూలంగానే సినిమాని అమ్మారని టాక్.

- Advertisement -

దీనితో సినిమా వాల్తేరు వీరయ్య లాగే ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంటే ఫస్ట్ వీక్ లోనే బిజినెస్ రికవరీ అయిపోతుందని సేఫ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక “భోళా శంకర్” ఆగష్టు11 న రిలీజ్ అవుతుండగా, 6న ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు