BholaShankar: ఈ డైరెక్టర్ హిట్ కొడితే అంత కన్నా అద్భుతం ఉండదు!

Meher Ramesh Bholashankar Movie

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టైలిష్, యాక్షన్ సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరున్న దర్శకుడు మెహర్ రమేష్. ఈ డైరెక్టర్ తెలుగు కంటే ముందు కన్నడలో ఇంట్రడ్యూస్ అయిన విషయం చాలా మందికి తెలియదు. వీర కన్నడిగ సినిమా తో డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమాని తెలుగులో ఆంధ్రావాలా పేరుతో పూరి జగన్నాథ్ తీయగా డిజాస్టర్ అయింది. తర్వాత ఒక్కడు రీమేక్ కన్నడలో చేసి హిట్ కొట్టాడు.

తెలుగులో కంత్రి సినిమాతో డైరెక్టర్ గా తొలి సినిమా చేసాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. కాని మెహర్ రమేష్ యాక్షన్ సీన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక 2009 లో రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన “బిల్లా” మెహర్ రమేష్ కెరీర్ లో ఒక స్టైలిష్ చిత్రంగా అన్నిటికంటే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడినా, ప్రభాస్ ఫ్యాన్స్ కి బిల్లా ఇప్పటికి ఫేవరేట్ గా ఉంటుంది. ఈ సినిమాతో మెహర్ రమేష్ కి స్టార్ హీరోల నుండి వరుస ఆఫర్లు వచ్చాయి.

అయితే నెమ్మదస్తుడైన మెహర్ రమేష్ ఎన్టీఆర్ తో శక్తి తీసాడు. ఈ సినిమాపై వచ్చినన్ని విమర్శలు మెహర్ కి ఎప్పుడూ వచ్చి ఉండవు. అంత దారుణంగా డిజాస్టర్ అయింది. ఇక చివరగా వెంకటేష్ తో చేసిన షాడో రిలీజ్ అయి అడ్రెస్స్ లేకుండా పోయింది. దీంతో అసలు మెహర్ రమేష్ కి ఒక్క అవకాశం కూడా రాలేదు. సినిమా ఛాన్స్ కోసం పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా వచ్చిన అవకాశమే “భోళా శంకర్”.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి కి దూరపు బంధువు అయినందువల్లో మరే కారణం వల్లో మెహర్ రమేష్ కి ఈ విధంగా అదృష్టం తలుపు తట్టింది. అయితే ఇది రీమేక్ సినిమా కాబట్టి ఆడియన్స్ కి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు. అయినప్పటికీ మెగాస్టార్ సినిమా కావడంతో నమ్మకంగా తెరకెక్కించాడు రమేష్. అయితే రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ పెద్దగా మెప్పించలేకపోయాయి.

దానికి రకరకాల కారణాలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా విజయం అందరికంటే మెహర్ రమేష్ కే కీలకం. ఎందుకంటే బిల్లా తర్వాత అతనికి ఒక్క హిట్ లేదు. తీసిన రెండు సినిమాలు డిజాస్టర్లు. పైగా పదేళ్ల కెరీర్ గ్యాప్. అన్నిటికి మించి తీసింది ఒక రొటీన్ రీమేక్ సినిమా. ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ లోను పెద్దగా ఇంట్రెస్ట్ లేని “భోళా శంకర్” కనుక హిట్ అయితే మెహర్ రమేష్ జీవితంలో అంతకన్నా అద్భుతం ఉండదు. మరి ఈ ఆ అద్భుతం జరుగుతుందా లేదా తెలియాలంటే ఆగష్టు11 వరకు వెయిట్ చేయాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు