Tollywood: ఈ డైరెక్టర్ నుండి మనకిక ఎంటర్టైన్మెంట్ రాదా?

When is the movie directed by Srinuvaitla?

టాలీవుడ్ లో ఎంటర్టైన్మెంటే ప్రధానంగా మాస్, యాక్షన్ సినిమాలు చేసే దర్శకుల్లో శ్రీను వైట్ల ముందు వరుసలో ఉంటాడని తెలిసిందే. ఈ డైరెక్టర్ తీసే ఏ సినిమా అయినా అందులో మేజర్ గా కామెడీయే హైలెట్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోలు తప్ప మీడియం రేంజ్ హీరోలతో కూడా సినిమాలు తీసేవాడు కాదు. కింగ్, దూకుడు, బాద్ షా వంటి వరుస బ్లాక్ బస్టర్లతో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు. అలాంటి స్టార్ డమ్ అనుభవించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు సినిమాలు లేక కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది.

బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలు తన వైపునకు చూడడం లేదు. ప్రొడ్యూసర్లు పట్టించుకోవడంలేదు. దీనికి కారణం శ్రీనువైట్ల స్వయంకృతాపరాధమే అని తెలుస్తుంది. శ్రీనువైట్ల తీసిన అన్ని చిత్రాలు కామెడీ ప్రధానంగా సాగేవే. ఒక్కటి కూడా సీరియస్ జోన్ లో, మాస్ జోనర్ లో వచ్చిన సినిమాలేదు. దీనికి తోడు ప్లాప్ వచ్చిన ప్రతిసారి కూడా కొత్త కాన్సెప్ట్ అని చెప్పి అదే రొటీన్ కామెడీ సినిమాలు తీసాడు. ఇప్పుడు జెనరేషన్ మారింది.

తెలుగు ఆడియన్స్ జబర్దస్త్ లాంటివి చూసి ఇప్పుడు విసిగిపోయారు. కామెడీ పుట్టించడం కన్నా, క్యారెక్టర్ చేసే పనుల నుండి పుట్టే కామెడీ సహజంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఫన్ ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అందుకే శ్రీనువైట్లకి వరుస డిజాస్టర్లు వచ్చాయి.
అయితే బాద్ షా సినిమా యావరేజ్ అయినప్పుడే శ్రీనువైట్ల గ్రహించి ఉండాలి. కానీ అది పట్టించుకోకుండా ఆగడు తో డిజాస్టర్ అందుకున్నాడు.

- Advertisement -

అయినా రామ్ చరణ్ లాంటి స్టార్ అవకాశమిస్తే మళ్ళీ అదే ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వెళ్లి మరో ప్లాప్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత అదే ఫ్యామిలి నుండి వరుణ్ తేజ్ ఛాన్స్ ఇవ్వగా ఆ సినిమా వచ్చిందని కూడా తెలియనంత దారుణంగా ప్లాప్ అయింది. ఇన్ని ప్లాపులొచ్చినా కెరీర్ అయిపోయిందన్న దశలో స్నేహధర్మంగా చివరి అవకాశాన్ని ఇచ్చాడు మాస్ రాజా రవితేజ. అప్పటికైనా శ్రీనువైట్ల మేల్కొవాల్సింది కానీ మారలేదు.

ఫలితంగా అమర్ అక్బర్ ఆంటోనీ ఒక చెత్త సినిమాగా మిగిలింది. ఈ సినిమా వచ్చి 5ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటివరకు శ్రీనువైట్లకి మరో సినిమా అవకాశం రాలేదు. ఇక ఇప్పుడు అతని డైరెక్షన్ లో సినిమా రావాలంటే తానే నిర్మాతగా మారి సినిమా తీస్తే గాని సాధ్యపడదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించని శ్రీనువైట్ల, ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా ఆక్టివ్ గా లేడు. మరి సినిమా ఛాన్స్ వచ్చేవరకు బయటికి రావొద్దని ఫిక్స్ అయ్యాడో ఏమో.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు