SIIMA celebrations has begun : ఆర్ఆర్ఆర్ ఎక్కడ తగ్గట్లేదు.. !

SIIMA celebrations has begun

ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన SIIMA ( సౌత్ ఇండియన్ ఇంటెర్నేషన్ మూవీ అవార్డ్స్) ఫంక్షన్ వేడుక హాలాహలం మొదలైంది. సెప్టెంబర్ 15,16 తేదీలలో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఘనంగా జరగనున్న ఈ ఈవెంట్ కు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ పరిశ్రమల ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్స్ హాజరుకానున్నారు.

తెలుగులో వివివి కేటగిరి లలో అవార్డులు ప్రధానం చేయడానికి ప్రారంభమైన నామినేషన్స్ లలో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ సృష్టించింది. సౌత్ ఇండియాన్ సినిమాలన్నిటిలో అధికంగా 11 కేటగిరిలలో ఆర్ఆర్ఆర్ మూవీ బెస్ట్ సినిమాగా నామినేట్ అయింది. ఇక రెండవ స్థానంలో పీరియాడిక్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సీతారామం సినిమా 10 కేటగిరీలలో నామినేట్ అయ్యి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రధానంగా పోటీ పడుతుంది. అలాగే ఈ రెండు సినిమాలతో పాటుగా బెస్ట్ తెలుగు సినిమా కేటగిరిలో కార్తికేయ2 ,డీజే టిల్లు, మేజర్ సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి.

ఇక కోలీవుడ్ విషయానికొస్తే తమిళ్ ఘన విజయం సాధించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, 10 కేటగిరీలలో నామినేషన్స్ తోమొదటి స్థానంలో ఉంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కమల్ హాసన్ సాలిడ్ కంబ్యాక్ ఫిలిం విక్రమ్ 9 నామినేషన్స్ తో సెకండ్ పొజిషన్లో ఉంది. అలాగే లవ్ టుడే, ధనుష్ నటించిన తిరు, మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ బెస్ట్ తమిళ్ సినిమా కేటగిలలో పోటీ పడుతున్నాయి. ఇక కన్నడలో కాంతారా, KGF 2 సినిమాలు ప్రధానంగా పోటీ పడబోతున్నాయి. ఇక ఈ రెండు సినిమాలతో పాటు 777 చార్లీ, లవ్ మాక్‌టెయిల్ పార్ట్ 2, విక్రాంత్ రోనా రేస్ లో ఉన్నాయి

- Advertisement -

అలాగే మలయాళం లో ప్రధాన పోటీ మమ్ముట్టి హీరోగా నటించిన భీష్మ పర్వం, ఇటీవలనే 2018 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న టోవినో థామస్ నటించిన తల్లుమాల సినిమా తో ప్రధానంగ పోటీ పడుతుంది. అలాగే హృదయం, జయ జయ జయ హే, జనగణమన, న్నా తాన్ కేస్ కోడు, చిత్రాలు బెస్ట్ మలయాళం మూవీ కేటగిరిలో పోటీ పడుతున్నాయి.

మరీ ఏ భాషలో ఏ చిత్రం, ఎన్ని అవార్డ్స్ సాధిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకు ఆగాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు